ఈ నేపథ్యంలోనే విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మీద ఎక్కువగా దృష్టి సారించారని చెప్పుకొచ్చారు. గంటా శ్రీనివాసరావు ఆర్థికంగా బలంగా ఉండటమే కాకుండా కాపు సామాజికవర్గంలో ఆయనకు మంచి పట్టు ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఆయన విషయంలో సానుకూలంగా ఉన్నారని ఆయన తో పవన్ కళ్యాణ్ మాట్లాడాలని అనుకుంటున్నారని అంటున్నారు. అలాగే బిజెపి మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మీద కూడా పవన్ కళ్యాణ్ ఎక్కువగా దృష్టి పెట్టారని వ్యాఖ్యలు వినపడుతున్నాయి.
ఆయనతో కూడా త్వరలో చర్చ జరిగే అవకాశాలు ఉండవచ్చని అంటున్నారు. విష్ణుకుమార్ రాజు కొంతమంది కీలక నాయకులను బీజేపీ నుంచి బయటకు తీసుకు రావచ్చు అని కూడా అంటున్నారు. అలాగే కృష్ణా జిల్లాకు చెందిన కామినేని శ్రీనివాసును కూడా ఆయన పార్టీలో తీసుకునే అవకాశం ఉండవచ్చని తెలుస్తుంది. కామినేని శ్రీనివాస్ జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉండవచ్చని అంటున్నారు. కమ్మ సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యలు వినపడుతున్నాయి. పవన్ కళ్యాణ్... కామినేని శ్రీనివాస్ కు అలాగే నాదెండ్ల మనోహర్ కు పార్టీ కీలక బాధ్యతలు అప్పగించే సూచనలు ఉన్నాయని తెలుస్తుంది. జాతీయ అధ్యక్ష బాధ్యతలను ఇవ్వాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి