నేడు బిజేపి “జాతీయ కార్యసమితి”  సమావేశం జరుగనుంది. జేపి నడ్డా బిజేపి జాతీయ అధ్యక్షుడు గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న తొలి “జాతీయ కార్యసమితి” సమేవేశం జరుగనుంది.  బిజేపి “జాతీయ కార్య సమితి” లో ప్రతి లోకసభ నియోజక వర్గం నుంచి ఒక ప్రతినిధి సభ్యుడుగా ఉంటారని సమాచారం అందుతోంది.  దేశంలోని అన్ని లోకసభ నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించే సభ్యులు ఆయా రాష్ట్రాల పార్టీ కార్యాలయాల నుంచే ఈ సమావేశంలో పాల్గొననున్నారు.  

ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగే సమావేశంలో పాల్గొననున్నారు జాతీయ కార్య వర్గ సభ్యు లు.   బిజేపి జాతీ య అధ్య క్షుడు గా ఎన్నికైన  జేపి నడ్డా కు దేశంలోని అన్ని లోకసభ నియోజకవర్గాలకు చెందిన పార్టీ ప్రతినిధులు ఆయా రాష్ట్రాల లోని పార్టీ కార్యాలయాల నుంచి తమ ఆమోదాన్ని తెలుపుతూ తీర్మానాలు తెలుపుతారు.  ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు బి జేపి “ జా తీయ కార్యా స మి తి ” సమావేశం జరుగనుంది.

  వచ్చే ఏడాది ఫిబ్రవరి లో ఐదు రాష్టాల— ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా—అసెంబ్లీలకు జరిగే ఎన్నికలు, దేశంలో నెల కున్న రాజకీయ, ఆర్ధిక పరిస్థితుల పై చర్చ జరుగనుంది.  ఆ తర్వాత బిజేపి జాతీయ అధ్యక్షుడు  జేపి నడ్డా ప్రసంగం ఉండనున్నట్లు సమాచారం అందు తోంది.  అంతిమంగా, మధ్యాహ్నం 2 గంటలకు బిజేపి “జాతీయ కార్యసమితి” ప్రతినిధుల నుద్దేశించి ప్రధాని మోడి ప్రసంగం కొనసాగనున్నట్లు తెలు స్తోంది. అయితే.. మహమ్మారి ఉన్న నేపథ్యంలో...  కొంత మందికి మాత్రమే...  ఈ సమావేశం పై ఆహ్వనం అందింది.  కరోనా నియం త్ర ణ చర్య లు ఉ న్న నేపథ్యంలో కేవలం 124 మంది మాత్రమే ఈ సమావేశానికి రానున్నట్లు సమాచారం అందుతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp