కరోనా వైరస్ కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. బయటకు వెళ్లేందుకు కూడా భయపడుతున్నారు. చివరికి ప్రముఖ ఐటీ సంస్థలు మొదలు... చిన్న చిన్న దుకాణాల వరకు ఆన్ లైన్ విధానానికి అలవాటు పడ్డారు. ఇక విద్యా సంస్థలు అయితే ఆన్ లైన్ విద్యా భోదనను అలవాటు చేసుకున్నాయి. ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు అన్ని విద్యా సంస్థలు ఆన్ లైన్ క్లాసుల్లోనే పాఠాలు భోదిస్తున్నాయి. చిన్న పిల్లలు కూడా ప్రస్తుతం మొబైల్స్, ల్యాప్ టాప్‌లకు అలవాటు పడిపోయారు. కొన్ని రాష్ట్రాల్లో ఆన్ లైన్ విధానం రద్దు చేసినప్పటికీ... కొన్ని రాష్ట్రాలు ఇప్పటికీ ఆన్ లైన్ తరగతులను కొనసాగిస్తున్నాయి. చాలా మంది విద్యార్థులు ఆఫ్ లైన్ క్లాసుల కంటే కూడా... ఆన్ లైన్ క్లాసులు ఉత్తమమంటున్నారు. ఇది విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతుందని కూడా మానసిన నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ ఆన్ లైన్ విధానంలో ఎన్నో ఇబ్బందులు కూడా కలుగుతున్నాయి.

బెంగళూరు ఐటీ హబ్‌లో ప్రముఖ విద్యా సంస్థ ఇప్పటికీ ఆన్ లైన్ క్లాసులు కొనసాగిస్తోంది. తాజాగా ఈ సంస్థ ఆన్ లైన్ క్లాసులకు హాజరై పాఠాలు వింటున్న విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆన్ లైన్ పోర్టల్‌లో ఒక్కసారిగా బూతు బొమ్మలు, పోర్న్ వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. ఇవి చూసిన విద్యార్థులు, తల్లిదండ్రులతో పాటు పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయులు కూడా ఒక్కసారిగా అవాక్కయ్యారు. వెంటనే... ఆన్ లైన్ క్లాసులను ఆపేశారు. విద్యాసంస్థ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు... ఈ విషయంపై చైల్డ్ రైట్స్ వెల్ఫెర్ సంస్థకు ఫిర్యాదు చేశారు. ఐటీ హబ్‌లోని లింగరాజపురంలో ఫేమస్ విద్యా సంస్థ ఉంది. అయితే పోర్న్ వీడియో రావడంతో... ఫేమస్ స్కూల్‌పై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వం ఆఫ్ లైన్ క్లాసులకు అనుమతి ఇచ్చినా కూడా... ఫేమస్ స్కూల్ యాజమాన్యం మాత్రం ఇప్పటికీ ఆన్ లైన్ లోనే క్లాసులు నిర్వహిస్తోంది. తమ స్కూల్ వెబ్ సైట్‌ను ఎవరో హ్యాక్ చేశారని... అందువల్లే ఆన్ లైన్ పోర్టల్‌లో పోర్న్ వీడియోలు వచ్చాయన్నారు. ఇందుకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: