వచ్చే యేడాది జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ప్రతి పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దేశంలో జనాభా పరంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయంగా కూడా ఇది చాలా ముఖ్యమైన ప్రాంతం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ 80 లోక్సభ స్థానాలు ఉన్నాయి. దీంతో ఈ రాష్ట్రంలో గెలుపు అన్ని పార్టీలకు అత్యంత కీలకం. రాష్ట్రంలోని 403 శాసనసభ స్థానాలకు వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో ప్రజామోదం పొందిన పార్టీలో 2024లో జరిగే లోక్సభ ఎన్నికల్లో కూడా రాష్ట్రంలోని అత్యధిక లోక్సభ స్థానాల్లో గెలుపు సాధించగలిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని 2024 సాధారణ లోక్సభ ఎన్నికలకు ప్రతి  పార్టీ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పైలెట్ ప్రాజెక్టుగా పరిగణిస్తున్నాయి .

 ఈ రాష్ట్రం ఆది నుంచి ఎక్కువ రాజకీయ చైతన్యం కలిగిన ప్రాంతం. ఇక్కడి నుంచే పలువురు ప్రధానులయ్యారు. ఈ రాష్ట్రానికి చెందిన పలువురు నాయకులు దేశ రాజకీయాల్ని అలవోకగా గుప్పిట పట్టారు. గత ఎన్నికలతో పోలిస్తే  యూపీలో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. వాస్తవానికి ఇంత వరకు ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు ఎలాంటి షెడ్యూల్ విడుదల కాలేదు. ఇప్పటికే  శాసనసభ పదవీకాలం 2022 మార్చి 14 వరకు ఉంటుంది. అయినప్పటికీ ఈ ఏడాది ముందే నుంచే రాష్ట్రంలో ఎన్నికల వేడి పెరిగింది. పార్టీల మధ్య పొత్తుల ప్రభుత్వాలు జరిగింది అయితే చివరి ప్రధాన పార్టీలన్నీ ఒంటరిగానే బరిలో దిగాలని నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో ఎంఐఎం ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వంద సీట్ల నుంచి పోటీ చేస్తామని ప్రకటించడం అన్ని వర్గాల్లో వణుకు పుట్టిస్తోంది. ఇందుకు కారణం ఉత్తరప్రదేశ్ ముస్లింల ఓట్ల సంఖ్య అధికం.

 ఇక్కడ దాదాపు 137 అసెంబ్లీ స్థానాల్లో  విజయ అపజయాలను ముస్లిం ఓట్లు నిర్ణయిస్తాయి. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 403 స్థానాలకు గాను బిజెపి 39.67 శాతం ఓట్లు పొందింది. ఈ విధంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఏడాది ముందుగానే  ఎన్నికల వేడి కొనసాగుతూ వస్తోంది. ప్రధానంగా లోక్సభ ఎన్నికల నాడి తెలిపేది ఉత్తర ప్రదేశ్ కావడం కీలకాంశం. ఇప్పటికీ పార్టీలన్ని ఒంటరి ప్రయాణం చేస్తూ వస్తున్నాయి. మరి ఎన్నికలు ఎవరికి కలిసి వస్తాయో  ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: