
తన దగ్గర డబ్బులు తీసుకుని పీటీ ఉషా, బిల్డర్ ఇద్దరూ కలిసి మోసం చేశారని జెమ్మా జోసఫ్ ఆరోపించారు. అటు బిల్డర్ మోసంపై కూడా కేరళ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీకి సైతం ఈ మాజీ అథ్లెట్ ఫిర్యాదు చేశారు. ప్లాట్ అప్పగించేందు, డబ్బులు తిరిగి ఇచ్చే విషయంపై కూడా ఇద్దరు కనీసం ఒక్కమాట చెప్పటం లేదని ఆరోపించారు జోసఫ్. పిటీ ఉషాతో పాటు మరో ఆరుగురిపై కూడా పోలీసులు ఛీటింగ్ కేసు నమోదు చేశారు. బిల్డర్ మోసం చేశాడనే మాజీ అథ్లెట్ ఫిర్యాదుపై కేరళ రియల్ ఎస్టేట్ రెగ్యులేరటీ అథారిటీ ఇచ్చే రిపోర్డు ఆధారంగా చర్యలు తీసుకుంటామని కూడా కోజికోడ్ పోలీసులు వెల్లడించారు. పీటీ ఉషా మాటలు నమ్మిన తర్వాతే బిల్డర్‌కు డబ్బులు ఇచ్చినట్లు జోసఫ్ ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పుడు కనీసం తనకు సంబంధం లేనట్లుగా పీటీ ఉషా వ్యవహరిస్తున్నారని... జోసఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలంటూ జోసఫ్ వేడుకుంటున్నారు.