వైఎస్ వివేకా హత్య కేసుకి సంబంధించి విచారణ హైకోర్టులో జరుగుతోంది. ఈ కేసులో నిందితుడు అయిన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి బెయిల్ పిటీషన్ ను కోర్టు కొట్టివేసింది.తనకు బెయిల్ ఇవ్వాలంటూ శివశంకర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు.ఇక బెయిల్ ఇచ్చేందుకు వీలు లేదని సీబీఐ వాదించడం జరిగింది.దేవీరెడ్డి శివశంకర్ రెడ్డి కీలక నిందితుడు కావడం వల్ల సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశముందని సీబీఐ తెలిపింది. కడప కోర్టు కూడా బెయిల్ రిజెక్ట్ చేసిందని సీబీఐ లాయర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.ఇక కేసు దర్యాప్తు కీలక దశల్లో ఉన్నందు వలన బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఇక సీబీఐ వాదనతో ఏకీభవిస్తూ శివశంకర్ రెడ్డి బెయిల్ పిటీషన్ ను కోర్టు కొట్టివేయడం జరిగింది.వైఎస్ వివేకా హత్య కేసులో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పేరును నిందితుడు దస్తగిరి చెప్పిన విషయం తెలిసిందే.

శివశంకర్ రెడ్డితోపాటు వైఎస్ కుటుంబ సభ్యుల పేర్లను కూడా దస్తగిరి ప్రస్తావించిన విషయం కూడా తెలిసిందే.వివేకా కుమార్తె అయిన డాక్టర్ సునీత కూడా హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో దేవిరెడ్డి పేరుంది. ఈ నేపథ్యంలోనే వివేకా హత్య కేసులో అరెస్ట్ అయ్యి కడప కేంద్ర కారాగారంలో ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయడం జరిగింది.ఇక ఈ హత్య చేస్తే శంకర్ రెడ్డి రూ.40 కోట్లు ఇస్తానన్నాడని.. అందులో రూ.5 కోట్లు నీకు ఇస్తానని వివేకాకు సన్నిహితుడైన ఎర్ర గంగిరెడ్డి తనతో చెప్పారని అప్రూవర్ గా మారిన షేక్ దస్తగిరి నేర అంగీకార వాంగ్మూలంలో వెల్లడించడం జరిగింది.. ఇక ఇప్పటికే తన తండ్రి వివేకా హత్యపై డాక్టర్ సుజాత కొన్ని ప్రూఫ్ లను సమర్పించింది.అందులో శివశంకర్ రెడ్డి పాత్రపై విచారించాలని ఆమె కోరింది.ఇక ఈ కేసులో నిందితుడు దస్తగిరి డాక్టర్ సునీతలు అనుమానించిన దేవి రెడ్డి నుంచి ఎలాంటి నిజాలు బయటకు వస్తాయన్నది వెయిట్ చేసి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: