నిన్న ఏపీ సీఎం రైతు భరోసా కార్యక్రమం నిర్వహించారు. రైతుల ఖాతాల్లో నగదు వేశారు. ఆ సందర్భంగా సీఎం జగన్‌.. రైతులకు తమ సర్కారు చేస్తున్న మేలు గురించి చెప్పుకొచ్చారు.  రైతు సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పాటుపడుతోందంటూ పనిలో పనిగా విపక్షాలనూ తిట్టిపోశారు. దీనిపై టీడీపీ నేతలు కూడా ఘాటుగా స్పందిస్తున్నారు. టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ.. జగన్ రెడ్డి సీఎం అయ్యాక వ్యవసాయానికి సాయం తగ్గిపోయిందన్నారు.


సీఎం జగన్ అన్నీ అబద్దాలే చెబుతున్నారని.. అబద్ధాలకు ఆస్కార్ అవార్డు అంటూ ఇస్తే అది జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని  టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర అంటున్నారు. దేశంలో సగటు రుణభారం రూ.75వేలు ఉంటే, ఏపీ రైతులపై ఉన్న రుణభారం రూ.2.45లక్షలు అంటూ  టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర లెక్కలు చెప్పుకొచ్చారు. మోసం అనేది జగన్ రెడ్డికి, వైకాపా ప్రభుత్వానికి వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించిన  టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర.. 5ఏళ్లలో కాలంలో రూ.12500కోట్లు మేనిఫెస్టో ప్రకారం రైతులకు ఇవ్వాల్సినవి ఇవ్వకుండా జగన్ మోసం చేశారని విమర్శించారు.


అర్హత ఉన్న రైతులకు నియమ నిబంధనల పేరుతో సంక్షేమం ఇవ్వకుండా సంఖ్యను తగ్గిస్తున్నారని  టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు. కులాల పేరుతో రైతుల్ని విభజించిన ఈ ప్రభుత్వానికి సన్మానం చేయాలంటూ  టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఎద్దేవా చేశారు. కేంద్రాన్ని వ్యతిరేకిస్తే అప్పుపుట్టదని దాసోహమంటూ వ్యవసాయమోటర్లకు మీటర్లు బిగిస్తున్నారని.. వద్దు మొర్రో అంటున్నా రైతుల మెడపై కత్తిపెట్టి మరీ మీటర్లు పెడుతున్నారని  టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు.


అసలు.. మీటర్లు పెట్టడం ఎందుకు, మళ్లీ రాయితీ ఇవ్వటం ఎందుకు అని ప్రశ్నించిన  టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర.. ఉచిత విద్యుత్ పథకాన్ని ఎత్తివేసే కుట్రలో భాగంగానే మీటర్లు పెడుతున్నారని ఆరోపించారు. అప్రకటిత విద్యుత్ కోతలతో గ్రామాలు, రైతులు అల్లాడిపోతున్నారని.. ఆక్వారంగంలో వేల కోట్లు పెట్టుబడులు పెట్టిన రైతులకు ఏంచేయాలో అర్థం కావట్లేదని.. ఆర్బీకేల పేరుతో రైతుల్ని నిలువునా దోచుకుంటున్నారని  టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: