ఆంధ్రప్రదేశ్లో కూటమి సీట్లు కొలిక్కి వచ్చినట్లుగా కనిపిస్తున్నది.. కూటమిలో భాగంగా టిడిపి జనసేన బిజెపి పార్టీలు తమ అభ్యర్థులను కూడా ప్రకటించారు.. ఇలాంటి సమయంలోనే కొన్ని నియోజకవర్గాలలో నేతల మధ్య కూడా గట్టి పోరు ఎక్కువగా వినిపిస్తోంది.. టికెట్టు ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠతో కూడా అన్ని పార్టీ నాయకులు కూడా ఉంటున్నారు.. బిజెపి అధిష్టానం తమకు కేటాయించిన పది ఎమ్మెల్యే స్థానాలలో కూడా అభ్యర్థులను నిన్నటి రోజున ప్రకటించింది..


అందులో ధర్మారం టికెట్ పైన ఆశలు పెట్టుకున్న పరిటాల శ్రీరామ్ కు ఎదురు దెబ్బ తగిలింది.. ధర్మవరంలో శ్రీరామ్ కు టికెట్ ఇవ్వకపోవడంతో అతని వర్గీయులు కూడా చంద్రబాబు పైన ఆగ్రహాన్ని తెలుపుతున్నారు. ధర్మవరంలో టిడిపి పార్టీ పడిపోయే పరిస్థితిలో శ్రీరామ్ అక్కడికి వెళ్లి బాధ్యతలు తీసుకున్నారని అనుచరులు కూడా పార్టీ అధినేతను గుర్తు పెట్టుకోవాలంటే నానా హంగామా చేస్తున్నారు. పరిటాల శ్రీరామ్ వచ్చిన తరువాత ధర్మారంలో పార్టీ పరిస్థితులు కూడా పూర్తిగా మారిపోయాయని అధికార పార్టీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పైన ఎన్నో రకాల పోరాటాలను కూడా చేసి పార్టీని నిలబెట్టారంటూ టిడిపి కార్యకర్తలు సైతం వెల్లడిస్తున్నారు.


కానీ ఎన్నికలు వచ్చే సమయానికి టికెట్ ఇతరులకు కేటాయించడం పైన టిడిపిలోని అసంతృప్తులు మొదలవుతున్నాయి. ఈ విషయం పైన చంద్రబాబు పైన టిడిపి కార్యకర్తలను కూడా ఆగ్రహాన్ని తెలుపుతున్నారు.. 2019లో పరిటాల శ్రీరామ్ ఎన్నికలలో నిలవగా ఓడిపోయారు. దీంతో ఈ ఎన్నికలు  శ్రీరామ్ కు చాలా కీలకంగా ఉండనున్నాయి. ఇప్పుడు పోటీ చేసే అవకాశం లేకపోవడంతో శ్రీరామ్ రాజకీయ జీవితం ఇక్కడితో ఆగిపోయినట్టే అంటూ పలువురు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ధర్మవరం టికెట్ పైన టిడిపి నుంచి పరిటాల శ్రీరామ్ బిజెపి నుంచి వరదాపురం సూరి టికెట్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేయగా ఈ ఇద్దరి నేతలకు నిరాశ చల్లుతూ ప్రధాన మోడీ సన్నిహితుడు బిజెపి భారతీయ సెక్రెటరీ సత్యకుమార్ కు ధర్మవరం టికెట్ ఇచ్చారు.. దాదాపుగా సత్యకుమార్ 34 ఏళ్లు గా బిజెపిలోనే ఉంటున్నారు.. ముఖ్యంగా మోడీ అమిత్ షాకు మంచి స్నేహితుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: