2014లో తెలంగాణ వచ్చాక తిరుగులేని పార్టీగా అవతరించింది బిఆర్ఎస్. ఇక తెలంగాణ అంటే బిఆర్ఎస్.. బిఆర్ఎస్ అంటే తెలంగాణ అన్న విధంగా పరిస్థితులు మారిపోయాయి. తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ ను ఓడించి మరో పార్టీ అధికారాన్ని చేజిక్కించుకోవడం అసాధ్యమని రాజకీయ పండితులు కూడా బల్లగుద్ది చెప్పారు. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో పరిణామాలు పూర్తిగా మారిపోయాయి.


 భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారాన్ని చేజిక్కించుకుంది. అప్పటినుంచి తెలంగాణలో తిరుగులేని పార్టీగా ఉన్న బిఆర్ఎస్ కు గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. ఇక ఆ పార్టీలో ఉన్న కీలక నేతలు అందరూ కూడా.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటూ వస్తున్నారు. దీంతో ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో బరిలో నిలబెట్టడానికి కేసీఆర్కు సరైన అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి  ఇలా కెసిఆర్ కు వరుసగా షాక్ లు తగులుతూ ఉండగా.. ఇటీవలే షాక్ తగిలింది. వరంగల్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది.


 అయితే ఇలా పోటీ నుంచి తప్పుకోవడం సర్వసాధనమే. కొన్ని కొన్ని సార్లు జరుగుతూ ఉంటుంది. కానీ ఇలా పోటీ నుంచి తప్పుకోవడమే కాదు కడియం కావ్య గులాబీ అధినేత కేసిఆర్ కు రాసిన లేక మాత్రం సంచలనంగా మారిపోయింది. ప్రస్తుతం తెలంగాణలో  పార్టీ పరిస్థితి ఎలా ఉంది అన్న విషయాన్ని ఆ లేఖలో చెప్పకనే చెప్పింది కడియం కావ్య. ప్రస్తుతం స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యేగా ఉన్న కడియం కావ్యం వరంగల్ టిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కేసీఆర్ ఇటీవల ప్రకటించారు. కానీ ఆమె పోటీ నుంచి తప్పుకుంది. ఈ క్రమంలోనే ఆమె రాసిన లేఖ చూసుకుంటే.. ఇటీవల మీడియాలో వస్తున్న కథనాలు, అవినీతి, భూకబ్జాలు, ఫోన్ టాపింగ్, లిక్కర్ స్కాం ఆరోపణలు పార్టీ ప్రతిష్టను ఎంతగానో దిగజార్చాయి. అంతేకాకుండా వరంగల్ జిల్లాలో పార్టీ నాయకుల మధ్య సమన్వయ లోపం కనిపిస్తుంది  ఎవరికి వారే యమునా తీరే అన్న విధంగా పరిస్థితి ఉంది. ఒకరి మధ్య ఒకరికి సహకారం కూడా కొరబడింది. ఇలాంటి పరిస్థితుల్లో పోటీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్న. అధినేత కేసీఆర్ పార్టీ కార్యకర్తలను మన్నించాలి అంటూ కడియం కావ్య లేఖలో పేర్కొన్నారు. కాగా ఆమె రాసిన లేక ఏకంగా పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయంశంగా మారింది. ఒకరకంగా పార్టీ పరిస్థితులను ఉద్దేశిస్తూ గులాబీ బాస్ కి కడియం కావ్య ఎటకారంగానే లేఖ రాసిందని.. ఇక కేసిఆర్ కు ఇంతకంటే అవమానం ఉండదు అంటూ కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: