ఏపీలో 2024 ఎన్నికలలో భాగంగా కూటమితో టిడిపి ప్రభుత్వం బరిలోకి దిగబోతోంది. అందుకు సంబంధించి అభ్యర్థులను కూడా ప్రకటించారు.. అయితే ఈ కూటమి ఎక్కువ కాలం నిలవలేక వికటిస్తోందన్న సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.. ఇండియన్ హెరాల్డ్ కు అందుతున్న సమాచారం ప్రకారం టిడిపి ప్రభుత్వం ఈసారి అధికారంలోకి వస్తుందన్న ధీమా భరోసా టిడిపి నాయకులు కార్యకర్తలలో క్రమక్రమంగా సడలిపోతున్నట్లు తెలుస్తోంది. పొత్తు భరోసా ఇవ్వలేకపోవడమే కాకుండా అందుకు విరుద్ధంగా భయాన్ని కూడా కలిగిస్తోందట.


టిడిపి ప్రభుత్వం అనవసరంగా పొత్తు పెట్టుకున్నానేమో అనెంతగా నాయకులు కార్యకర్తలు ఈ విషయం వెంటాడుతూనే ఉంది. పొత్తు వల్ల తమకే నష్టం కలుగుతోందని టిడిపి ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.. ఇండియన్ హెరాల్డ్ తెలిసిన సమాచారం మేరకు.. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూటమి అసమ్మతిపాలుగానే కనిపిస్తోంది. ముఖ్యంగా బిజెపి టిడిపి టిడిపి పొత్తుతో చావు దెబ్బ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆ పార్టీ నాయకులే వాపోతున్నారు.. ఇక జనసేన నాయకులు కూడా ఈ విషయం పైన చాలా అసహనంగా ఉన్నట్టు ఇప్పటికే ఎంతోమంది ఈ విషయాన్ని తెలియజేశారు.


అలా ఎంతోమంది నాయకులు కార్యకర్తలు కూడా వైసీపీ పార్టీలోకి చేరారు. ఎన్నో ఏళ్ల అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు తన రాజకీయ చరిత్రలోనే తప్పటడుగులు వేస్తున్నారని తన సొంత క్యాడరే ఈ విషయాన్ని గమనించిందని సమాచారం. గతంలో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం చాలా వీక్ అయ్యిందని తాము లేకపోతే ఈ పార్టీ ఉనికే లేదని కూడా బహిరంగంగానే వెల్లడించారు. ఆ సమయంలో జనసేన పార్టీకి సీట్లు ఎక్కువగా వస్తాయనికున్నప్పటికీ కేవలం 21 అసెంబ్లీ మూడు పార్లమెంటు స్థానాలకు మాత్రమే పరిమితం చేశారు.


ఈ విషయంపై.. ఇండియన్ హెరాల్డ్ అంది వస్తున్న కథనం మేరకు.. జనసేన కార్యకర్తలు నాయకులలో కూడా తీవ్రమైన ఆగ్రహం వెలువడింది.. ముఖ్యంగా తాము లేనిది జగన్ ను చంద్రబాబు ఎదుర్కొనే సత్తా లేదని జనసేన కార్యకర్తలు తెలియజేశారు. అలాంటిది తమ పార్టీకి అని తక్కువ సీట్లు ఇవ్వడం పై.. కూటమిలో  నీలి నీడలు ఏర్పడుతున్నాయి.. ఆంధ్రాలో బిజెపి పార్టీ చాలా బలహీనమైన పార్టీ.. కేవలం ఈ పార్టీతో పోత్తు కేంద్రంలో బలం కోసమే అన్నట్టుగా తెలుస్తోంది.. ఏది ఏమైనా ఈ మూడు పార్టీలు మధ్య పొత్తు అంటే మూడు కత్తులుగా మారుతున్నాయి.. ఈ పొత్తుల వల్ల ఏపీ సీఎం జగన్ కు రాజకీయంగా కలిసి వస్తుందనే వాతావరణం కూడా ఏర్పడినట్లు తెలుస్తోంది. మరి వచ్చే ఎన్నికలలో వైసీపీని అధికారం చేపడుతుందేమో అనే అంతలా మారిపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

BJP