ప్రస్తుతం ఏపీలో పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు పావులు కదుపుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే అధికార వైసిపి పార్టీని ఓడించేందుకు అటు టిడిపి జనసేన, బిజెపి పార్టీలతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతుంది. ఇక ఈ పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు కూడా చేసుకుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇలా మూడు పార్టీలు జట్టుగా ముందుకు సాగుతూ జగన్ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.


 ఈ క్రమంలోనే ఆంధ్ర రాజకీయాలు అంతకంతకు వేడెక్కిపోతున్నాయి అని చెప్పాలి. కాగా ఇక ఎన్నికలు వచ్చాయి అంటే సీటు దక్కని నేతలందరూ కూడా అసంతృప్తితో ఒక పార్టీని వీడి మరో పార్టీలో చేరడం చూస్తూ ఉంటాం. ఇక ఆంధ్ర రాజకీయాల్లో కూడా ఇలాంటి పార్టీ ఫిరాయింపులు ముమ్మరంగా సాగుతున్నాయి. అప్పటివరకు ఉన్న నమ్మకమైన నాయకుడిగా కొనసాగిన వారు ఊహించని రీతిలో మరో పార్టీ గూటికి చేరుకోవడం సంచలనంగా మారిపోతుంది. మొన్నటి వరకు ఏకంగా పవన్ కు నమ్మినబంటుగా కొనసాగిన పోతిన మహేష్ సైతం ఇలా జనసేన పార్టీని వీడి వైసిపి గూటికి చేరుకున్నారు అన్న విషయం తెలిసిందే.


 తాను జనసేన జెండా కాకుండా మరో పార్టీ జెండా పట్టుకుంటే చేయి నరుక్కుంటాను అంటూ ఇక వైసీపీలో చేరకముందు శపతాలు చేసిన పోతిన మహేష్ చివరికి చెప్పిన మాటలను పక్కనపెట్టి వైసిపి కండువా కప్పుకున్నారు. అయితే ఇదే విషయం గురించి జనసేన నేత కిరణ్ రాయల్ స్పందిస్తూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు  పది రోజుల ధర్నాలు, దీక్షలు, ప్యాకేజీ, ఫైనల్ గా పోతిన మహేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జనసేన కాకుండా వేరే జెండా పట్టుకుంటే చేయి నరుక్కుంటా అన్నావు కదా.. ఇప్పుడు చెప్పు ఏ చేయి నరుక్కుంటావ్. కొబ్బరి బొండాల కత్తి పంపించాలా.. మీరు పార్టీ నుంచి తప్పుకుంటారు అని తెలిసే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీకు సీటు ఇవ్వలేదు. ఆయన గురించి మాట్లాడే స్థాయి నీకు లేదు అంటూ విమర్శించారు కిరణ్ రాయల్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ap