ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ ఈనెల 13న పూర్తి అయ్యింది. అయితే ఫలితాలు మాత్రం వచ్చే నెల నాలుగవ తేదీన ప్రకటించబోతున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ నిలబడిన పిఠాపురం నియోజవర్గం పైన కూడా సర్వాత్ర ఉత్కంఠత నెలకొంటోంది. గతంలో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈసారి గెలవాలని ఉద్దేశంతోనే చాలామంది సెలబ్రిటీలను తీసుకువచ్చి ప్రచారం చేసుకున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికలలో కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ స్థానం ఒక రికార్డును సైతం క్రియేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.


నియోజవర్గ చరిత్రలోనే ఎన్నడూ లేనటువంటి విధంగా 86.63 శాతం వరకు పోలింగ్ నమోదయిందని 2019లో చూస్తే భారీగానే ఎక్కడ ఓట్లు ఫోలయ్యాయని కూడా చెప్పవచ్చు. దీంతో జనసేన అధినేత , కార్యకర్తలు సైతం పోలింగ్ శాతం ఎక్కువగా కలిసి రావడంతో తమ పార్టీని గెలుస్తుందని ప్రచారం చేసుకుంటూ బెట్టింగ్ కూడా ఎక్కువ పోలయ్యేలా చేస్తున్నారు. అయితే ఈ క్రమంలోని నియోజకవర్గానికి సంబంధించి మెజారిటీ లెక్కలు సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా పిఠాపురం నియోజవర్గంలో 2,38,000 ఓట్లు ఉన్నాయట. అయితే ఇందులో పోలైన ఓట్లు కేవలం..2,04,800 అన్నట్లుగా తెలుస్తోంది.


అదేవిధంగా ఇందులో కాపు ఓట్లు 65,300 ఓట్లు పోలు కాగా..16,325 ఓట్లు వంగా గీతాకు వచ్చాయని.. 48,975 ఓట్లు పవన్కు పడ్డాయని.. బీసీల విషయానికే వస్తే 81,700 ఓట్లు పోల్ కాగా..45,000 ఓట్లు గీతాకు అని..36,700 ఓట్లు పవన్ కు వస్తాయని.. మొత్తం మీద నియోజకవర్గంలో చూసుకుంటే వంగా గీతా కు 1,05,575 ఓట్లు పవన్ కళ్యాణ్ కు 98,935  ఓట్లు వస్తాయని.. వంగా గీత 6వేలకు పైగా ఓట్లు మెజారిటీతో గెలుస్తుందని లెక్కలతో తేల్చి చెబుతున్నారు.. ఇందుకు సంబంధించిన కాపీని కూడా ఒక నెటిజెన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసి మరి చెప్పడంతో ఇప్పుడు వైరల్ గా మారుతోంది. దీంతో పలువురు వైసిపి నేతలు ఈసారి కూడా పవన్ కళ్యాణ్ కి ఓటమి తప్పదని ఎంతమంది సెలబ్రిటీలను తీసుకువచ్చి గెలవాలని చూసిన పవన్ కళ్యాణ్ కష్టమంతా వృధా అయిపోయేలా కనిపిస్తోంది అనే విధంగా మాట్లాడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: