ఇలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అభిప్రాయాన్ని అధికారులకు తెలియజేశారట. ముఖ్యంగా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉండడంతో తానే స్వయంగా రంగంలోకి దిగుతున్నానని తెలియజేశారు. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో ఏలేరు రిజర్వాయర్కు భారీగా వర్షపు నీరు రాబోతుందట. ఈ వరద కారణంగా పిఠాపురానికి కూడ ముప్పు పొంచి ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలియజేశారట. ప్రస్తుతం రిజర్వాయర్ గరిష్ట 24 టీఎంసీలు ఉన్నప్పటికీ ఇప్పటికే 20 టీఎంసీలు వరద నీరు సైతం అక్కడికి చేరినట్లు తెలుస్తోంది.
దీంతో ముందస్తు చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. ముఖ్యంగా చెరువులకు గండ్లు పడకుండ, అలాగే రోడ్డుమీద నీళ్ళు నిలబడకుండా సైడ్ కాలాలను క్లీన్ చేయించడం, గుంతలను పూడ్చి పెట్టడం పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలని.. సీఎం సంబంధిత అధికారులతో సూచన చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పిఠాపురం వ్యవహారాలన్నీ కూడా దగ్గరుండి మరి అధికారులను సూచించేలా చేయడమే కాకుండా తానే దగ్గరుండి మరి ఈ పనిని చేయిస్తున్నారట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దీంతో ఈ రోజున కాకినాడ పర్యటన చేసినట్లుగా తెలుస్తోంది. అక్కడ కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ ని నిర్వహించి పలు రకాల సూచనలు ఇస్తున్నారట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వరద ముప్పు ప్రాంతాల నైపద్యంలో అధికారులను కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.