మెగా బ్రదర్ నాగబాబు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అయితే ఇటీవలే ఎమ్మెల్సీగా కూడా గెలవడం జరిగింది. కానీ నాగబాబు రాజకీయంగా చూస్తే ఇంకా వర్ధమాన దశలోనే ఉన్నారనే విధంగా కనిపిస్తోంది. నాగబాబు గురించి రాజకీయంగా పెద్దగా ఎవరూ కూడా గుర్తించలేదనే విధంగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.. ఇవన్నీ కూడా పక్కన పెడితే ఇటీవలే ప్రధాన నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో అతిథులతో కొంతమేరకు మాట్లాడిన అక్కడ ఎమ్మెల్సీ నాగబాబు కూడా కనిపించారట.


మోదీ కి స్వాగతం పలికేందుకు జనసేన పార్టీ తరపున నాగబాబు వచ్చారు. అయితే పక్కన బిజెపి నేత సోము వీర్రాజు కూడా ఉన్నారు. ఆయన దాకా వచ్చి పలకరించిన మోదీ నాగబాబుని సైతం అభినందనలు తెలుపుతూ ఉన్న మోడీ ఎవరా అంటూ ఆలోచనల పడిపోయారట. అయితే నాగబాబును గుర్తుపట్టలేదని అక్కడున్న వారందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. నరేంద్ర మోడీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి మధ్య ఎంత అనుబంధం ఉందో చెప్పాల్సిన పనిలేదు. కానీ ఆయన సోదరుడైన నాగబాబుని గుర్తుపట్టకపోవడమే ఇక్కడ చర్చనీయాంశంగా మారుతున్నది.


నాగబాబు ఇప్పుడు ఎమ్మెల్సీగా అయ్యారు భవిష్యత్తులో కూడా మరింత రాజకీయంగా ముందుకు వచ్చి తన సత్తా చూపించుకొని తనని తాను రుజువు చేసుకుంటే అప్పుడే మీడియాలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారని.. అలా కేంద్ర పెద్దలు కూడా తనను గుర్తించే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నారు కార్యకర్తలు. కానీ జనసేన పార్టీలో మాత్రం నాగబాబు స్థానం రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. అందుకు ఉదాహరణ ప్రధాన మోదీ ఆహ్వానానికి పంపించడమే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మోదీ ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టగానే తనని పలకరించడానికి వచ్చిన వారందరితో మాట్లాడి వారి యొక్క క్షేమాలను కూడా తెలుసుకున్నారట. కానీ నాగబాబు దగ్గరికి వచ్చేసరికి  గుర్తు పట్టలేదనే విధంగా ఒక రూమర్ వినిపిస్తోంది. ఏది ఏమైనా ఈ రూమర్ చూస్తూ ఉంటే రాజకీయంగా నాగబాబు మరింత ఎదగాలని అభిమానులు కార్యకర్తలు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: