ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్యయుద్ధ వాతావరణ నెలకొన్న సంగతి తెలిసిందే.  యుద్ధం వద్దు శాంతియుతంగా ఉందామని ఇండియా చెపుతుంటే... దొంగ దెబ్బ తీస్తూ రెచ్చిపోతుంది పాకిస్తాన్. అయినప్పటికీ ఇండియన్ ఆర్మీ తెగించి కొట్లాడి... పాకిస్తాన్ దేశానికి చుక్కలు చూపిస్తోంది. జమ్ము కాశ్మీర్ లోని పహాల్గాం... ప్రాంతంలో హిందూ ముస్లిం మధ్య చిచ్చు పెట్టేందుకు 28 మందిని చంపేశారు పాకిస్తాన్ ఉగ్రవాదులు. హిందువు అయితే చంపేస్తాం.. ముస్లిం అయితే వదిలేస్తామని... 28 మందిని పొట్టన పెట్టుకున్నారు. అయినప్పటికీ హిందూ ముస్లింల మధ్య ఇండియాలో ఎక్కడ గొడవ జరగలేదు.

 

అటు సిక్కులు అలాగే హిందువుల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేశారు. దీనికోసం గురుద్వార్లను ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు పాకిస్తాన్ ఆర్మీ అలాగే ఉగ్రవాదులు. అయినప్పటికీ సిక్కులు మాత్రం ఆ ట్రాప్ లో పడలేదు. అలాగే క్రైస్తవ మిషనరీలపై బాంబులు వేసే ప్రయత్నం చేశారు. కొంతమంది క్రైస్తవులను చంపారు. ఇదంతా చేసింది హిందువులని చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ హిందువులు అలాగే క్రైస్తవులు ఒక్కటై పాకిస్తాన్ ను ఎదుర్కొంటున్నారు.

 

అటు పాకిస్తాన్ డ్రోన్లు కూడా విఫలమవుతున్నాయి. గతంలో ఎన్నడు లేని విధంగా ఆర్థిక సంక్షోభాన్ని పాకిస్తాన్ ఎదుర్కొంటుంది. అప్పు కోసం ప్రపంచ దేశాలను అడుక్కుంటుంది. పెట్రోల్ కూడా పాకిస్తాన్లో అయిపోయింది. తినేందుకు ఆహారం కూడా లేదు. ఇలా పాకిస్తాన్ గత 70 ఏళ్లలో లేని పరిస్థితులను ఎదుర్కొంటోంది. అటు పాకిస్తాన్లోని TTP తిరుగుబాటు దారులు... వాళ్ల ఆర్మీ సైన్యం పైన దాడి చేస్తున్నారు. ప్రత్యేక దేశం కావాలని అంటున్నారు. బలూచిస్తాన్ ఆర్మీ కూడా ఇదే... వాదన తెరపైకి తీసుకువస్తోంది. పాకిస్తాన్ ఆర్మీకి చుక్కలు చూపిస్తోంది.

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ : వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: