
ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసులో ఇరుక్కుంటున్నాడు. అలాగే బ్రీతింగ్ సమస్యతో బాధపడుతున్న వల్లభనేని వంశీ.. ఆరోగ్యం కూడా రోజురోజుకు క్షీణిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో వల్లభనేని వంశీకి మరో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. వైసీపీ నేత వల్లభనేని వంశీ పై మరో కేసు నమోదు చేశారు. 2019లో బాపులపాడు మండలం లో ఓటర్లను ప్రభావితం చేయడానికి నకిలీ పట్టాలు ఇచ్చాడని అభియోగం.. తెరపైకి వచ్చింది. ఇలాంటి నేపథ్యంలో... వల్లభనేని వంశీ పై కేసు నమోదు అయింది.
వల్లభనేని వంశీని కస్టడీకి కోరుతూ నూజివీడు కోర్టులో పీటి వారంట్ దాఖలు చేశారు బాపులపాడు పోలీసులు. దీంతో వల్లభనేని వంశీ మరికొన్ని చిక్కులో పడ్డట్టయింది. ఇక అటు రెండు రోజుల కిందట వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. తీవ్ర అనారోగ్యానికి గురైన వల్లభనేని వంశీని విజయవాడలోని ఆసుపత్రికి తరలించారు జైలు అధికారులు. ప్రస్తుతం ఆయన పరిస్థితి దారుణంగా ఉందని చెబుతున్నారు. విపరీత మైన దగ్గుతో బాధపడుతున్నారు వల్లభనేని వంశీ.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు