
నిజానికి కొడాలి ఈపాటికే అరెస్ట్ అయ్యి వల్లభనేని వంశీతో పాటు విజయవాడ జైల్‌లో ఉండాలి. కానీ గుండెపోటు అంటూ ఆయన తప్పించుకున్నారు. ఇటీవలె ముంబైలో హార్ట్ సర్జరీ చేయించుకున్న కొడాలి.. ప్రస్తుతం హైదరాబాద్‌లో రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే హైదరాబాద్ సేఫ్ కాదనుకున్నారో ఏమో.. మెరుగైన చికిత్స పేరుతో అమెరికాకు వెళ్లేందుకు కొడాలి నాని ప్లాన్ చేసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతానికి మెడికల్ వీసాపై అమెరికా వెళ్లిపోయి.. ఆ తర్వాత అక్కడే ఉండటానికి ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన భావిస్తున్నారట. ఇక అత్యంత సన్నిహితులైన కొందర్ని తప్పా.. ఇంకెవ్వరినీ కొడాలి కలవడం లేదుట. పరామర్శకు వస్తామని కబురు వైసీపీ ముఖ్య నేతల కబురు చేస్తున్నా కొడాలి మాత్రం వారిని ఆహ్వానించడం లేదని కూడా ఇన్‌సైడ్ టాక్ నడుస్తోంది. మరి ప్లాన్ ప్రకారం కొడాలి నాని అమెరికా జంప్ అవుతారా? లేక ఈలోగానే కూటమి సర్కార్ ఆయన్ను లాక్ చేయనుందా? అన్నది చూడాలి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు