- ( రాయ‌ల‌సీమ - ఇండియా హెరాల్డ్ )

ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంలో ఉన్న వైసిపి .. అటు అధికార పక్షంలో ఉన్న జనసేన ఉప్పు నిప్పు గా ఉంటాయి. అయితే తిరుపతిలో మాత్రం చెట్టా పట్టాలు వేసుకుని కలిసి పని చేస్తున్నాయి. చిత్తూరు నుంచి తీసుకువచ్చి తిరుపతిలో నిలబెట్టారు అరణి శ్రీనివాసులను.. ఆయన తిరుపతిలో జనసేన ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకముందు ప్రభుత్వంలో చిత్తూరు వైసిపి ఎమ్మెల్యేగా కొనసాగారు. పార్టీ మారి ... నియోజకవర్గం మరి మరోసారి ఎమ్మెల్యే అయ్యారు. అంతవరకు బాగానే ఉంది.. కానీ జనసేనలో మాత్రం లోకల్ , నాన్ లోకల్ ఫీలింగ్ వచ్చినట్టు తెలుస్తోంది. పార్టీ కొత్త నేతలు పాత జనాలను పట్టించుకోవడం వరకు బాగానే ఉంది ... పాత వైకాపా సంబంధాలు ఇప్పుడు కొత్త పొత్తులకు తెరతీస్తున్నాయని రాజకీయ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే వర్గం ... తిరుపతి లోకల్ వైసిపి వర్గం బెంగుళూరు హోటల్లో సమావేశమై కలిసి ఎలా ముందుకు సాగాలి ? అనే దానిమీద ఇప్పటికే ఓ అవగాహన వచ్చేసారని వార్తలు ఇప్పుడు తిరుపతిలో జోరుగా వినిపిస్తున్నాయి.


కార్పొరేషను పరిధిలో గతంలో చేసిన దందాలు .. ఒప్పుకున్న దందాలు రాబోయే కాలంలో చేసే పనుల విషయంలో పరస్పరం ఎలా సహకరించుకోవాలి ? అనేదానిపై జనసేన మధ్య ఒక అవగాహన కుదిరిందని తెలుస్తోంది. తిరుపతిలో రోడ్డు పక్కన ఉండే చిరుతిల్ల బండ్లు .. దోసెల బండ్ల దగ్గర రోజు వసూలు చేసే మాముళ్ల‌ విషయంలో కూడా ఓ అవగాహన కుదిరిందని ప్రచారం గుప్పు మంటోంది. తిరుపతి లోకల్ జనసేన జనాలు ఇప్పుడు ఈ ఒప్పందం గురించి తెలిసి కింద మీద పడుతున్నారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లాల వద్దా ? ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది అని డిస్కస్ చేసుకుంటున్నారట. ముఖ్యంగా జనాల దగ్గర దండిగా వసూలు చేస్తే ఆ ప్రభావం పార్టీ మీద పడుతుందని పాయింట్తో మీరు పవన్ దగ్గరికి వెళ్లాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: