తెలంగాణ రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.. కాలేశ్వరం ప్రాజెక్టు విషయంలో అవినీతి జరిగిందని... ప్రత్యేకంగా ఒక కమిషన్ ను నియమించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అయితే ఏడాది పాటు విచారణ చేసిన ఈ కమిషన్ తాజాగా కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు నోటీసులు జారీ చేసింది. కెసిఆర్ హయాంలోనే ఆ ప్రాజెక్టు కట్టడంతో... మొదటగా కెసిఆర్ కు నోటీసులు ఇచ్చిన ఈ కమిషన్... హరీష్ రావు అలాగే ఈటల రాజేందర్ కు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది.

 దీంతో ఈ ముగ్గురి విచారణ జూన్ 5వ తేదీ నుంచి వరుసగా ఏడో తేదీ వరకు కొనసాగనుంది. అయితే ఈ నోటీసులపై ఇప్పటివరకు ముగ్గురు లీడర్లు కూడా స్పందించలేదు. తనకు నోటీసులే రాలేదని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. అప్పట్లో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు ఉన్న నేపథ్యంలో ఆయనకు.. ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటలకు నోటీసులు ఇచ్చారు. అయితే ఈ నోటీసులో నేపథ్యంలో తాజాగా కేసీఆర్ ఫామ్ హౌస్ కు హరీష్ రావు వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి.

 ఈ సందర్భంగా నోటీసులపై కేసీఆర్ తో చర్చలు నిర్వహించారట హరీష్ రావు. అటు ఈటల రాజేందర్ కూడా కెసిఆర్ తో సమావేశం అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నోటీసులపై ఎలా ముందుకు వెళ్లాలి...? అనే దానిపై కేసీఆర్ తో చర్చించబోతున్నారట. అయితే గతంలో ఇద్దరు మధ్య విభేదాల కారణంగా గులాబీ పార్టీని వీడారు ఈటల రాజేందర్. మరి ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ను ఎలా కలుస్తారో చూడాలి. ఒకవేళ కేసీఆర్ ను ఈటల రాజేందర్ కలిస్తే తెలంగాణ రాష్ట్రంలో బిగ్ బ్లాస్టింగ్ న్యూస్ అవుతుంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ : వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: