
ఈ నేపథ్యంలో కేంద్రం ఐదు రోజుల క్రితం కరోనా మార్గదర్శకాలను జారీ చేసింది .. తగిన సూచనలను సలహాలు ఇస్తూ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అంటూ హెచ్చరించింది . ఇందులో భాగంగానే గుంపులు గుంపులుగా ప్రజలు ఎక్కడ తిరగకూడదని ..రైల్వే స్టేషన్ లో .. బస్టాండ్లో కరోనా మార్గదర్శకాలను పాటించాలి అని.. సోషల్ డిస్టెన్స్ తప్పనిసరి అని వృద్ధులు గర్భిణీలు ఎక్కువగా బయటకు రాకుండా ఇంటి వద్దనే ఉండాలి అంటూ పరిశుభ్రత పాటించాలి అని మాస్కులు ధరించాలి అని కోవిడ్ లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి అంటూ చెప్పుకొచ్చింది.
కాగా ఈనెల 21న ప్రజా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ అధికారులకు జారీ చేసిన మార్గదర్శకాలను కేవలం మూడు అంటే మూడు రోజుల్లోనే వెనక్కి తీసేసుకుంది. దీనంతటికి కారణం మహానాడు అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. రాష్ట్రంలో కొన్ని కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో మే 21న జారీ చేసిన మార్గదర్శకాలపై జిల్లా కలెక్టర్లు స్పష్టత కోరారు అని.. దీనిపై వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక మార్గ ప్రధాన కార్యదర్శి సమీక్ష నిర్వహించారు అని తెలిపారు. అంతేకాదు ఏపీలో మూడు కేసులు మాత్రమే నమోదు అయ్యాయని.. దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని ..ఇవి కూడా తీవ్రమైనవి కావు అని వెల్లడించారు. అంతేకాదు మే 21న జారీ చేసిన మార్గదర్శకాలు అన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రజారోగ్యం కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ తెలిపారు. దీంతో అందరూ మహానాడు పై పడ్డారు. మహానాడు కారణంగానే ఈ విధంగా చేస్తున్నారు అని మహానాడు లేకపోయి ఉంటే రూల్స్ అలాగే కంటిన్యూ చేసేవారు అని.. తమ కోసం ఒక రూల్ వేరే వాళ్ళ కోసం ఒక రూల్స్ అంటూ టిడిపి గవర్నమెంట్ ని ఏకేస్తున్నారు. మరికొందరు మాత్రం మహానాడు ఇప్పుడు అవసరమా..? కోవిడ్ వ్యాప్తి ఎక్కువ అవుతుందేమో..? ఆలోచించుకోండి సార్..? అంటూ డైరెక్ట్ గా చంద్రబాబును ట్యాగ్ చేస్తున్నారు..!