
వైసీపీ అధినేత జగన్ పొలిటికల్ క్యాలెండర్ ఎలా ఉంది ? జగన్ ప్రతిపక్షంలోకి వచ్చి ఇప్పటికే యేడాది దాటుతోంది. జగన్ కేవలం తాడేపల్లికి పరిమితం కావటం నాయకులను తన దగ్గరకు పిలిపించుకొని వారికి ఓ గంట క్లాస్ పీకేయడంతో సరిపెడుతున్నారు. తాజాగా వెన్నుపోటు దినం కార్యక్రమానికి పిలుపు ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యకర్తలలో చిన్నపాటి జోష్ అయితే వచ్చింది. జగన్ సైలెంట్ గా ఉండటం పార్టీ కేడర్ నాయకులు హర్షిస్తున్నారా ? అంటే పెద్ద ప్రశ్నగానే మిగులుతుంది. తాజాగా నిర్వహించిన వెన్నుపోటు దినం కొన్నిచోట్ల సక్సెస్ అయితే .. కొన్నిచోట్ల ఫట్ అన్నట్టుగా సాగింది. మరీ ముఖ్యంగా నాయకుల మధ్‌య సమన్వయం లేకపోవడంతో ఎవరికి వారు యమునా తీరు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. గత ఏడాదికాలంగా వైసీపీ అధికారపక్షంపై గట్టి పోరాటం చేయడంలో విఫలమైనట్టుగా రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. జగన్ కేవలం తాడేపల్లికి పరిమితం కావడం పెద్ద మైనస్.
తాజాగా పోలీసులు చేతిలో దెబ్బలు తిన్న యువకుల కుటుంబాలను పరామర్శించడం వాటికే పరిమితమయ్యారు. ఇది రాజకీయంగా జగన్ గ్రాఫ్ ను మరింత తగ్గించిందే తప్పా ఎగబాకెలా చేయలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు జగన్ తమ పార్టీ నేతలకు పొలిటికల్ క్లాసులు ఇచ్చే అంత సమయం లేదు. వెంటనే రంగంలోకి దిగవలసిన అవసరం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు కూడా ఇంటి దగ్గర ఉంటానని చెబితే ... బెంగళూరుకే పరిమితం అవుతానని అంటే ఇక జగన్‌ను కాపాడే నాథుడు ఎవరు ఉండరు. ఏపీ విభజన తర్వాత జగన్ రెండుసార్లు ఎన్నికలలో ఓడిపోతే ... వైసీపీ నాయకులు రోజు ఓడిపోతున్నారని చర్చ కూడా తెరమీదకు వచ్చింది. సరైన విధానాలు లేకపోవడం పక్కా ప్రణాళిక లోపించడం.. ఇవన్నీ వైసీపీని దెబ్బ కొడుతున్నాయి. ఏది ఏమైనా జగన్ ఇకపై దూకుడు పెంచాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు