ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం  టిడిపి కూటమి సర్కార్ అధికారంలో ఉంది. 2019లో గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి గద్దె దించి టిడిపి కూటమి అద్భుతమైన మెజారిటీతో ఫామ్ లోకి వచ్చింది.. కనీసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా చేసిందని చెప్పవచ్చు.. ఈ విధంగా వన్ సైడ్ రిజల్ట్ మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో కనబడింది.. అలాంటి ఈ రాష్ట్రంలో  టిడిపి కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సర కాలం గడిచింది.. ఇప్పటికీ టిడిపి గెలుపుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణాలేంటి అనేది ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరు వివరిస్తూనే ఉన్నారు.. 

తాజాగా ఒక అధికారి కూడా  వైసీపీ ఓటమికి కారణాలు చెప్పాడు.ఆ వివరాలు ఏంటో చూద్దామా.. ఆ మధ్యకాలంలో రాహుల్ గాంధీ మహారాష్ట్ర, బీహార్ లో మ్యాచ్ ఫిక్స్ అయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే విషయాన్ని ప్రస్తావిస్తూ మాజీ ఐఏఎస్ అధికారి పీవీఎస్ శర్మ ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎలక్షన్స్ మే 2024 లో  సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ 68.12 అయింది ఫైనల్ కి వచ్చేసరికి 81.86 మొత్తం డిఫరెన్సు 13.74 శాతం వచ్చింది. ఈ విధంగా ఓటింగ్ ఒక్కో నియోజకవర్గానికి దాదాపు 26 వేలకు పైగా ఓటింగ్ శాతం పెరిగింది. టోటల్ రాష్ట్రవ్యాప్తంగా  46 లక్షల ఓట్లు పెరిగిపోయాయి అని అన్నారు.

 ఇదే కూటమి అభ్యర్థుల విజయానికి కారణం అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఈ మధ్యకాలంలో ఎక్కడ ఓటింగ్ జరిగిన కూడా బిజెపి గెలిచింది అంటే తప్పకుండా ఏదో జరిగిందని చాలామంది అనుమానిస్తున్నారు. అయితే కూటమి సర్కార్ కూడా బిజెపికి సపోర్టుగా ఉంది. ఇందులో ఏదో జరిగిందంటూ జగన్ కూడా అన్నారు. తాజాగా పీవీఎస్ శర్మ అనడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం అయింది. మరి నిజంగానే ఓటర్లు పెరిగారా.. లేదంటే తెర వెనుక ఈవీఎం ల విషయంలో ఏదైనా జరిగిందా అనేది  ఎవరికి అంతు పట్టని రహస్యం..

మరింత సమాచారం తెలుసుకోండి: