
అదే ఇప్పుడు మైండ్ గేమ్ ఎలా నడపాలి అన్నటువంటిది కాన్సెప్ట్ తో చంద్రబాబు ముందుకు వెళ్తున్నారు.. సీనియర్ ఎన్టీఆర్ మంచోడు అంటే మంచోడు అన్నట్టుగా నడపాలి.. చెడ్డోడు అంటే చెడ్డోడు గా నడపాలి.. మోడీ మంచోడు అంటే మంచోడు అన్నట్టుగా నడపాలీ.. చెడ్డోడు అంటే చెడ్డోడు అన్నట్టుగా నడపాలి.. మైండ్ గేమ్ నడపడం అనేటువంటిది కూడా ఒక అద్భుతమైన స్ట్రాటజీ అని చెప్పవచ్చు.. పేపర్లు, టీవీలు ,రచ్చబండల దగ్గర మాట్లాడుకునే మాటలు, సోషల్ మీడియా దగ్గర ఇలా అన్నీ కూడా మనకి తెలిసిన కూడా అసలు ఆ అంశాన్ని పక్కనపెట్టి ఇది తప్పు అది ఒప్పు అన్నట్లుగా మారిపోతూ ఉన్నది.
తాజాగా సూపర్ సిక్స్ హామీలలో 85% అమలు చేశామంటూ కూటమి ప్రభుత్వం తెలుపుతోంది. ఈ విషయాన్ని మంత్రి పార్థసారధి గారు తెలియజేశారు. 85% అంటే 85% పథకాలు అమలు చేసినట్టు అని చెబుతున్నారు.. కానీ ఈ వ్యాఖ్యలు విన్న ప్రజలు మాత్రం చేసింది రెండు పథకాలే అప్పుడే అయిపోయాయా అంటూ మాట్లాడుకుంటున్నారు.. ప్రజలను ఇంకా మభ్య పెట్టాలని మోసం చేయాలని చూస్తున్నారా అంటూ వైసీపీ నేతలు కూడా ప్రజలకు సపోర్టివ్ గానే మాట్లాడుతున్నారు. సూపర్ సిక్స్ లో పథకాల విషయానికి వస్తే..
1). దీపం పథకం.. ఇది అమలు అయింది
2). తల్లికి వందనం: ఇటీవలే మొదలుపెట్టారు.
3). అన్నదాత సుఖీభవ: ఈ నెలలోనే రాబోతోందని తెలుపుతున్నారు.
సూపర్ సిక్స్ హామీలలో 6 లో రెండు అయినాయి.. ఇంకా నాలుగు హామీల ఉన్నాయి.. అందులో అన్నదాత సుఖీభవ, నిరుద్యోగులకు పెన్షన్, ఫ్రీ బస్సు, ప్రతి మహిళకు 1500 రూపాయలు నెల నెల అన్నటువంటివి మిగిలాయి.
నిరుద్యోగులకు, మహిళలకు డబ్బులు అన్నది ఆలోచన చేయలేదు.. ఇవే కాకుండా మేనిఫెస్టోలో చాలా అంశాలను పొందుపరిచారు. కానీ ఏవి కూడా అమలు చేయకుండానే సైకలాజికల్ గా సూపర్ సిక్స్ హామీలు 85% వరకు పూర్తి అయ్యాయనే విధంగా అన్నటువంటిది హైలెట్ చేస్తున్నారు. ఈ విషయంపై ప్రజలు తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. మరి దీని ఫలితం ఏంటన్నది చూడాలి.