
రాయలసీమలో అత్యధికంగా కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలను సాధించారు.. అయితే ఇందులో 33 మంది కూటమి ఎమ్మెల్యేల పైన తీవ్ర వ్యతిరేకత ఉన్నదని తెలిపారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు 33లో 29 మంది గెలవడం కష్టమే అన్నట్లుగా తెలుపుతున్నారు.
2).అలాగే రెడ్ జోన్ లో నలుగురు మంత్రులు ఉన్నట్లుగా తెలియజేయడం జరిగింది.
3). మొదటిసారి ఎన్నికైన కూటమి ఎమ్మెల్యేలు 90% పైగా అవినీతి ఆరోపణలు ఉన్నాయని తెలిపారు.
4). అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే పైన తీవ్రస్థాయిలో విమర్శలు ఉన్నాయని తెలిపారు.
5). చిత్తూరు పార్లమెంటులో.. కుప్పం, పలమనేరు నియోజవర్గాలు తప్ప మిగిలినవి కూటమి మర్చిపోవడమే మంచిదని తెలిపారు.
6). టిడిపి సీనియర్ల నియోజకవర్గం వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలది పై చేయి అన్నట్లుగా తెలిపారు. అలాగే రాయలసీమ కూటమిలో వైసీపీ నేతలు ఎక్కువమంది ఉన్నారని తెలుపుతున్నారు.
7). రైల్వే కోడూరు ఎమ్మెల్యే మొత్తం టిడిపి పెత్తనం అంత చూస్తున్నారా అన్నట్లుగా తెలుపుతున్నారు.
8). కడపలో ఉన్న నేతలు ప్రచార ఆర్భాటం ఎక్కువ క్షేత్రస్థాయిలో ఫలితాలు భిన్నంగా ఉన్నాయని తెలుపుతున్నారు.
9). ముఖ్యంగా ఎస్సీ నియోజకవర్గాలన్నీ కూడా వైసిపి వైపే ఉన్నాయని తెలిపారు. ఇందుకు సంబంధించి త్వరలోనే అన్ని విషయాల తెలుపుతామని ప్రవీణ్ పుల్లట్ల తమ ట్విట్టర్ ద్వారా తెలిపారు.