
ఆయన పేరు తెలుగు రాష్ట్రాల్లో తెలియనివారు ఉండరు. మరీ ముఖ్యంగా విజయవాడ రాజకీయాల్లో ఆయన ఓ సెన్సేషన్.. తనదైన ముద్ర వేసుకున్నారు. అలాంటి వంగవీటి మోహన రంగా గురించి ప్రస్తావిస్తూ జనసేన పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి . ఓ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో వంగవీటి మోహన రంగా టాపిక్ ప్రస్తావనకు వచ్చింది . ఇదే మూమెంట్లో "అసలు రంగా బ్రతికి ఉండుంటే .. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ స్థాపించే పరిస్థితి ఉండేదా..? "అని నాగబాబు ను యాంకర్ ప్రశ్నించగా..ఆయన ఎక్సలెంట్ ఆన్సర్ ఇచ్చారు.
దీనికి జవాబుగా నాగబాబు "వంగవీటి మోహన్ రంగా ఉండుంటే అసలు ఆ అవసరమే ఉండుండేది కాదు..ఓ గొప్ప వ్యక్తి.. 10 మందికి సహాయం చేసే గొప్ప నాయకుడు .. అలాంటి నాయకుడు ఇప్పుడు పాలిటిక్స్ లో ఉండి ఉంటే అసలు చిరంజీవి - పవన్ కళ్యాణ్ కు పార్టీ పెట్టే అవసరమే ఉండేది కాదు .. సొంత పార్టీలు పెట్టవలసిన అవసరం వచ్చేది అంతకన్నా కాదు. ఆయన కనుక సీఎం అయితే మాకు బాధ్యతలు తగ్గేవి.. మేము హాయిగా ఉంటూ సినిమాలు చేసుకునే వాళ్లము.. ఆయన లేకపోయేసరికి ఇలా పరిస్థితులు అదుపుతప్పి తప్పనిసరి పరిస్థితుల్లో చిరంజీవి - పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లోకి రావాల్సి వచ్చింది. ఎవరో ఒకరు బాధ్యతలు తీసుకోవాలి కాబట్టి పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగాడు. అసలు రంగా బతికి ఉంటే ప్రజారాజ్యం పార్టీ - జనసేన పార్టీ వచ్చే పరిస్థితి ఉండేది కాదు" అంటూ తెగేసి చెప్పేసాడు నాగబాబు .దీంతో సోషల్ మీడియాలో నాగబాబు మాట్లాడిన మాటలు బాగా వైరల్ అవుతున్నాయి. మరి మీరు ఏమంటారు..? నిజంగా నే వంగవీటి మోహన్ రంగా బ్రతికుంటే పాలిటిక్స్ లో భారీ మార్పులు వచ్చేవా..? చిరంజీవి-పవన్ కల్యాణ్ పాలిటిక్స్ లోకి వచ్చే వారు కారా..?