ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా తమిళనాడులో పర్యటించారు. బిజెపి అధ్యక్షుడు అన్నామలై ఆధ్వర్యంలో జరిగినటువంటి సభకు ఆయన హాజరై పలు ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. హిందుత్వ నినాదంపై మాట్లాడడంతో రాష్ట్రవ్యాప్తంగా పలువురు స్పందించారు. ముఖ్యంగా ఈ ఇష్యూపై బాహుబలి నటుడు సత్యారాజ్ పవన్ కళ్యాణ్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.. ఇంతకీ ఆయన ఏమన్నాడు ఆ వివరాలు ఏంటో చూద్దాం.. దేవుడి పేరుతో తమిళనాడులో రాజకీయాలు చేస్తే సహించేది లేదని బాహుబలి నటుడు సత్యరాజ్ అన్నారు. మతాన్ని అడ్డం పెట్టుకొని ఓట్లు పొందాలనే ప్రయత్నం తమిళ గడ్డపై ఫలించవని తెలియజేశారు. తమిళ ప్రజలంతా పెరియార్ సిద్ధాంతాలు నమ్ముతారని, అలాంటి తమిళులను మోసం చేయలేరని హెచ్చరించారు. 

తమిళ ప్రజలు చాలా తెలివైన వారని తమిళనాట మీ ఆటలు సాగవని సత్య రాజ్ విమర్శించారు. ఇదే ఇష్యూపై అధికార పార్టీ కూడా చాలా వరకు తట్టుకోలేకపోతోంది. హిందుత్వాన్ని దూషిస్తూ ద్వేషిస్తూ గుళ్ళకి పోటీగా మానవ ఆలయాలు  కట్టించి, నీ విగ్రహానికి నువ్వే పూజ చేసుకో అంటూ కంచి కామకోటి పీఠంతో సహా అనేక పీఠాలను ఏర్పాటు చేశారు. పెరియార్ సిద్ధాంతంపై  నడుస్తున్నటువంటి చాలామంది పవన్ మాటలను విమర్శిస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మాట్లాడింది ఎవరిని ప్రత్యేకంగా ఉద్దేశించి కాదు. పెరియార్ సిద్ధాంతాన్ని నమ్మవద్దని పవన్ కళ్యాణ్ అక్కడ చెప్పలేదు. హిందుత్వం గురించి మాత్రమే మాట్లాడారు. ఆయన చెప్పినంత మాత్రాన హిందువులు పెరియార్ సిద్ధాంతాన్ని పాటించరు. పెరియార్ సిద్ధాంతాన్ని పాటించేవారు హిందుత్వం వైపు వెళ్లరు.

ఎవరి మతం వారిది ఎవరి భక్తి వారిది. ఇక్కడ పవన్ కళ్యాణ్ మాట్లాడగానే ఆ మాటలను తట్టుకోలేక చాలామంది అక్కసు వెళ్ళగక్కుతూ పెరియార్ సిద్ధాంతాన్ని తెరపైకి తీసుకువచ్చి మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. కట్ చేస్తే పవన్ కళ్యాణ్ కు ఆంధ్రప్రదేశ్ లో ఏ విధమైనటువంటి పట్టు లభించిందో అంతకు రెట్టింపుగా తమిళనాడులో  ఆదరణ లబ్దిస్తోంది. అన్నామలైతో పవన్ కళ్యాణ్, ఏఐడిఎంకే పార్టీలు కలవడంతో డిఎంకె పార్టీకి మింగుడు పడడం లేదు.. ఎలాగైనా డీఎంకే పార్టీని గద్దెదించాలని పవన్ కళ్యాణ్ ను రంగంలోకి దించి బిజెపి ముందుకు వెళ్తోంది.. ఒకవేళ ఈ ప్లాన్ సక్సెస్ అయితే మాత్రం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా తమిళనాడు దేశవ్యాప్తంగా తిరుగులేని పొలిటిషన్ గా రికార్డుల్లోకి ఎక్కుతాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: