- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

వైసీపీ అధినేత జగన్ కు వరుసగా కష్టాల మీద కష్టాలు ఎదురవుతున్నాయి. ఒకవైపు నేతల నోటి దురుసు వ్యాఖ్యల కారణంగా పార్టీకి సాధారణ ప్రజల్లో మైనస్ అవుతుంది. ఇక నియోజకవర్గం గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం ఇన్చార్జి బాధ్యతలు అప్పగించి మూడు నెలలు అవుతుంది. ఇప్పటివరకు ఆయన విజయవాడలో అడుగు పెట్టలేదు. కనీసం పార్టీ నాయకులతో టచ్లోకి కూడా రాలేదు. ఈ సమయంలో ఆయన పార్టీ తరపున వాయిస్ కూడా వినిపించడం లేదు. జగన్ వెంట అప్పుడప్పుడు మీడియా ముందు కనిపిస్తున్నారు. ఇక విజయవాడ విషయానికి వస్తే ఇక్కడ ఇన్చార్జిగా మోదుగుల పార్టీ తరఫున ఒక కార్యక్రమం కూడా నిర్వహించలేదు. పార్టీ నాయకులను సమీకరించడం .. వారి సమస్యలను తెలుసుకోవడం .. నియోజకవర్గం పార్టీని ఎలా బలోపేతం చేయాలి ? అని అంశం పై ఇప్పటివరకు చర్చలు కూడా లేవు.


దీంతో మోదుగల వల్ల విజయవాడకు ఎలాంటి ప్రయోజనం అన్న ప్రశ్నలు తెర‌మీద‌కు వస్తున్నాయి. మరోవైపు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ నాయకుడు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కూడా పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయన పార్టీ మారతారు అన్న ప్రచారం తెర‌ మీదికి వచ్చింది. వెల్లంపల్లి పార్టీ మారకపోయిన వైసీపీకి దూరంగా ఉండటం .. ఇప్పుడు అందరిలోనూ చర్చ నీయాంశంగా మారింది. తనను గతంలో ఇష్టం లేకపోయినా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కు మార్చ‌డం ఆయ‌న‌కు ఎంత మాత్రం ఇష్టం లేదని.. ఆ అసంతృప్తితో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా సైలెంట్ గా ఉంటున్నారు అన్న ప్రచారం కూడా విజయవాడ వైసీపీలో వినిపిస్తుంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: