బాబా వంగా అంటే మన దేశం లోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా చాలా మంది కి తెలుసు.. బాబా వంగా చెప్పిన ఎన్నో మాటలు ప్రస్తుతం నిజమవుతున్నాయి.. అయితే బాబా వంగ 2025  గురించి కూడా  చాలా విషయాలు బయట పెట్టారు. బాబా వంగా చెప్పిన విషయాల ను ప్రముఖ ఆస్ట్రాలజిస్టు షర్మిష్ట కూడా బలపరిచారు. బల్గేరియన్ కి చెందినటు వంటి బాబా వంగా  భవిష్యత్తు ను చెప్పే దైవిక శక్తి కలిగి ఉందని చెప్పుకొచ్చారు. బాబా వంగా చెప్పిన మాటలు చాలా వరకు నిజమయ్యాయి. ముఖ్యంగా 2025లో సునామీ, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయని చెప్పారు. ఆయన చెప్పిన ప్రకారమే  భూకంపాలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. 

అంతేకాదు  పలు దేశాల మధ్య యుద్ధాలు జరుగుతాయని చెప్పారు. ప్రస్తుతం చాలా దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా  హిందూ మతం గురించి కూడా  ప్రస్తావించారు. దక్షిణ భారత దేశానికి చెందిన ఒక నాయకుడు  ప్రపంచ స్థాయి లో పేరు తెచ్చుకుంటారని, రష్యా వంటి  పెద్ద దేశం కూడా హిందూ మతాన్ని ప్రచారం చేస్తుందని చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే దక్షిణాది లో పవన్ కళ్యాణ్ పెద్ద లీడర్ గా ఎదుగుతున్నారు.

ఆయనే కాకుండా అన్నామలై, ఫడ్నావిస్  కూడా ఉన్నారు. 2029 తర్వాత  పవన్ కళ్యాణ్ మన దేశాన్ని ఏలే అంత పెద్ద లీడర్ అవుతాడని  బాబా వంగా అప్పట్లో అన్న మాటలు  ప్రముఖ ఆస్ట్రాలజర్ షర్మిష్టా  బలపరచడం తో అవికాస్త సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఆస్ట్రాలజర్ షర్మిష్ట పవన్ కళ్యాణ్  దేశాన్ని ఏలే స్థాయి కి వెళ్తారని గట్టిగా చెప్పారు.. దాంతో నరేంద్ర మోడీ తర్వాత ప్రధాన మంత్రి పవన్ కళ్యాణ్ అవుతారని పవర్ స్టార్ అభిమానులు షర్మిష్ట  మాట్లాడిన వీడియో ను తెగ వైరల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: