
ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగిన ఈ నేత మూడుసార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచారు. 2019లో కాంగ్రెస్ పార్టీ నుంచి టిడిపిలోకి వెళ్లారు. ఆ ఎన్నికలలో సూర్యప్రకాశ్ రెడ్డి కర్నూలు నుంచి ఎంపీగా ఆయన భార్య సుజాతమ్మ ఆలూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2024లో ఇద్దరూ కూడా ఎంపీగా, ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నప్పటికీ ఒకరికి టికెట్ ఇస్తామని టిడిపి చెప్పగా కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి ఎమ్మెల్యేగా డోన్ నియోజకవర్గం నుండి పోటీ చేశారు. ఇక్కడ విజయాన్ని అందుకున్నారు.
కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి ఇటీవలే అసెంబ్లీకి కూడా రాలేదు. అలాగే మహానాడుకు కూడా దూరంగానే ఉండడంతో టిడిపి పార్టీ పైన అసంతృప్తి ఉన్నదని ప్రచారం జరిగింది. డోన్ లో మరొక టిడిపి నేత సుబ్బారెడ్డి పెత్తనం చేస్తున్నారని అందుకే ఆయన సహించలేకపోతున్నారనే విధంగా వినిపించాయి. దీంతో సూర్యప్రకాశ్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి వైసీపీలోకి వెళుతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరగగా.. ఈ విషయం పైన కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ తను టిడిపి పార్టీని వీడేది లేదని మంత్రి పదవి రాలేదని అసంతృప్తితో ఉన్నానని చెబుతున్నారు..అలాంటిదేమీ లేదు డోన్ నియోజకవర్గం లో అభివృద్ధి పనుల పైనే తన పూర్తి ఫోకస్ ఉందని తెలిపారు. తన కాలికి సర్జరీ చేయించుకున్నారని నిమోనియాతో బాధపడుతున్నానని అందుకే కోలుకోవడానికి కొంత సమయం పట్టిందంటూ తెలిపారు. ఈ విషయాన్ని అధిష్టానానికి కూడా చెప్పానని తెలిపారు.