
జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతనిత్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ప్రతిపక్ష వై ఫై వైసీపీ ఉందా ? సోదిలో కూడా లేకుండా పోయిందా అన్నది ఇప్పుడు కాకినాడ జిల్లా రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. పిఠాపురం నియోజకవర్గంలో వైసిపి తరఫున వాయిసు వినిపించడం లేదా ? అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు. గతంలో వైసీపీ నుంచి గెలిచిన పెండెం దొరబాబు జనసేనలో చేరిపోయారు. ఇప్పుడు ఆయన అనుచరులు అందరు వరుస పెట్టి జనసేనలోకి వెళ్లిపోతున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ ఎంపీ వంగా గీత ఇప్పుడు పిఠాపురానికి దూరంలో ఉన్నారు. ఆమె ఎక్కడా నియోజకవర్గంలో కనిపించడం లేదు. ఇటీవల వైసిపి అధినేత జగన్ బాబు మేనిఫెస్టో పై కార్యక్రమానికి పిలుపు ఇచ్చారు. ప్రతి ఇంటికి వెళ్లాలని చంద్రబాబు మాట తప్పారన్న విషయాన్ని పూసగుచ్చినట్టు ప్రతి ఒక్కరి కి వివరించాలని చెప్పారు. ఇది రాష్ట్రంలోనే పెద్దగా వర్కౌట్ కాలేదు.
అసలు పిఠాపురంలో ఈ కార్యక్రమాన్ని పట్టించుకున్న నాథుడే లేడు. ఆ మాటకు వస్తే అసలు గత ఏడాది కాలంలో పిఠాపురంలో వైసిపి కార్యక్రమాలు చేసే వారే కనిపించడం లేదు. వంగా గీత మాట కూడా నియోజకవర్గంలో ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆమె ఒకటి రెండు సమావేశాలు నిర్వహించిన వైసీపీ కేడర్ ఎవరు రావడం లేదు. దీంతో ఆమె ఇంటికే పరిమితమయ్యారు. గీత విమర్శలు జోలికి కూడా పోవడం లేదు. పిఠాపురంలో రెండు మూడు గంటలలో జరిగిన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైసీపీ నాయకులు స్పందిస్తున్న వంగా గీత మాత్రం నోరు మెదపటం లేదు. వంగా గీత రాజకీయంగా అభద్రత భావంతో ఉన్నారని ప్రచారం జరుగుతుంది. టిడిపి నాయకుడు మాజీ ఎమ్మెల్యే వర్మ అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో ఆయనపై వైసీపీ వల విసిరితోంది. ఆయనకు భారీ ఎత్తున మీడియాలో కవరేజ్ వస్తుంది. వర్మ వైసీపీలోకి వస్తారన్న ప్రచారం కూడా గట్టిగా జరుగుతూ ఉండడంతో వంగా గీత ఎటు తేల్చుకోలేని పరిస్థితి. ఓవరాల్‌గా చూస్తే పిఠాపురంలో వైసిపిని పట్టించుకున్న నాథుడే లేడని చెప్పాలి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు