
అయితే ఇలా చేయడం ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమంటూ హైకోర్టు తెలియజేసింది. తొలగించే ముందు కనీసం నోటీస్ ఇవ్వకుండానే తొలగిస్తారా? అంటూ ప్రశ్నించింది. అన్యాయం నుంచి కాపాడేందుకు ఈ న్యాయస్థాలు ఉండేదని.. సహజ న్యాయ సూత్రాలను తీసుకువచ్చామంటూ గుర్తు చేశారు. ఉద్దేశపూర్వకంగానే ఆ యువతుని ఉద్యోగం నుంచి తొలగించారని తేల్చింది హైకోర్టు. ఇతరుల వాదనలు వినకుండా శిక్షించాలన్నది చేయడం తప్పంటూ తెలిపింది.
ప్రస్తుతం ఈ కేసులో అంగన్వాడి కార్యకర్త వనలక్ష్మిని అధికారులు ఏకపక్షంగా తొలగించారంటూ స్పష్టం చేస్తూ.. నోటీసులు ఇవ్వకుండా వివరణ తీసుకోకుండానే ఉద్యోగం నుంచి ఎలా తొలగిస్తారు అంటు వనలక్ష్మికి నాలుగు వారాలలో రూ .25 వేల రూపాయలు ఖర్చుల కింద ప్రభుత్వమే డబ్బులు చెల్లించాలని ఆదేశాలను జారీ చేసింది హైకోర్టు. అర్ధాంతరంగా ఉద్యోగం నుంచి తొలగించి ఆమెకు మానసికంగా ఇబ్బంది కలిగించారని.. ఆమెను తొలగించాలని ఉత్తర్వులను జారీ చేసిన చర్యలను రద్దు చేసింది హైకోర్టు. ఈ మేరకు జస్టిస్ న్యాయమూర్తి తలారి రాజశేఖర్ రావు ఇటీవలే తీర్పును తెలియజేశారు. దీంతో 2013 నుంచి యువతి చేస్తున్న న్యాయ పోరాటానికి ఇప్పుడు న్యాయం లభించింది. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం పొన్నంపేట గ్రామానికి చెందిన వనలక్ష్మి 2011లో అంగన్వాడి కార్యకర్త పోషణకు దరఖాస్తు చేసుకున్నారు.. 2012లో ఇంటర్వ్యూలో విజయం సాధించి ఎంపికయ్యింది. విధులలో చేరినటువంటి నాలుగు నెలల తర్వాత వనలక్ష్మి తమ గ్రామ వాసి కాదు అంటూ పోన్నంపేటకు చెందిన కొంతమంది కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. వీటి ఆధారంగా లక్ష్మీని అంగన్వాడి కార్యకర్త పోస్టునుంచి 2013లో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారి జనవరిలో తొలగించారు. ఈ విషయాన్ని సవాల్ చేస్తూ ఆమె హైకోర్టులో అదే ఏడాది ఫిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయంపై జస్టిస్ రాజశేఖర్ రెడ్డి తుది విచారణ జరిపి.. పిటిషన్ తరపున న్యాయవాది వాదనను వినిపించారు.. ఈ వాదనను విన్న తర్వాత అధికారుల తీరును తప్పుపట్టి .. ఆమెకు న్యాయం చేశారు.. 2013 అంటే ఇది కాంగ్రెస్ పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో జరిగింది.