
ఈ రెండు అంశాలపైనే జేసీ రగిలిపోతున్నారు. ఈ కారణంగానే కంటిపై కునుకులేకుండా పోయిందని జేసీ అనుచరులు చెబుతున్నారు. రాజకీయంగా జేసీ.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డితో విభేదిస్తున్న విషయం తెలిసిందే. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు.. తమ కుటుంబాన్ని వేధించారని.. జైలు పాలు కూడా చేసే ప్రయత్నం చేశారని ఆయన చెప్పకొస్తున్నారు. ఈ క్రమంలోనే రాజకీయ వైరాన్ని ఎట్టి పరిస్థితిలోనూ.. ఉపేక్షించేది లేదని.. అంటున్నారు. పెద్దారెడ్డిని నియోజకవర్గంలోకి అడుగు పెట్టకుండా చేస్తానని అంటున్నారు.
అయితే.. జేసీ ఆలోచన ఎలా ఉన్నా.. పెద్దారెడ్డి మాత్రం నియోజకవర్గంలోకి వస్తున్నారు. తన ఇంటిని.. తన అనుచరులను కూడా ఆయన కాపాడుకుంటున్నారు. అయితే.. తాను ఇంత పోరాటం చేస్తున్నా.. పెద్దారెడ్డి ఇంత ధైర్యంగా ఎలా ఉంటున్నారన్నది జేసీకి అంతుచిక్కని వ్యవహారం. ఇది ఆయనలో కోపాన్నిరెట్టింపు చేస్తోంది. ఇక, అధికారులు ఎవరూ కూడా.. తన మాట వినిపించుకోవడం లేదని.. జేసీ చెబుతున్నారు. తన కుమారుడు ఎమ్మెల్యే అయినా.. తనను లెక్క చేయడం లేదని ఆయన ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు.
దీని వెనుక సొంత పార్టీ ఎంపీ ఒకరు కీలక పాత్ర పోషిస్తున్నారన్నది జేసీ చెబుతున్న అంతర్గత విషయం. ``మా వోళ్లు.. దొంగ నాయాళ్లు. చంద్రబాబు ఒక్కడే మంచోడు`` అని తరచుగా ఆయన మీడియా ముందు అనేస్తున్నారు. సో.. దీనిని బట్టి జేసీకి చెక్ పెడుతోంది సొంత పార్టీ నేతేనని.. అది కూడా ఎంపీ స్థాయి వ్యక్తేనని తెలుస్తోంది. గతంలో ఆదినారాయణరెడ్డితో వివాదం వచ్చినప్పుడు కూడా.. ఎంపీనే చక్రం తిప్పారని అంటున్నారు. ఇప్పుడు జేసీ బలపడితే.. భవిష్యత్తులో తమకు రాజకీయంగా ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతోనే సదరు నేత మరికొందరితో కలిసి.. జేసీకి చెక్ పెడుతున్నారని అంటున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు