
బీజేపీ పార్లమెంటరీ బోర్డు, ఎన్డీఏ భేటీలు ఢిల్లీలో జరుగుతున్నా.. వాటితో పాటు చంద్రబాబు – లోకేశ్ ముఖ్యంగా లిక్కర్ స్కాం దర్యాప్తుపైనే ఫోకస్ చేస్తున్నారని చెబుతున్నారు. ఈ కేసులో సిట్ ఇప్పటికే పలు కీలక ఆధారాలు సేకరించిందని, అంతిమ లబ్ధిదారు దాకా దర్యాప్తు చేరుకుందని సమాచారం. ఆ ఆధారాలను కేంద్ర మంత్రులకు, ప్రధాని మోదీకి చూపించి, ఈడీ ద్వారా ఫైనల్ చర్యలకు అనుమతి తీసుకోవాలని సీఎం ప్రయత్నిస్తున్నారట. ఇదే నిజమైతే వైసీపీకి ఇది పెద్ద షాక్ అవుతుంది. ఎందుకంటే లిక్కర్ స్కాం ఇష్యూను హై వోల్టేజ్‌గా నడిపి, ప్రతిపక్షాన్ని పూర్తిగా డిఫెన్స్‌లోకి నెట్టేలా టీడీపీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో బిగ్ బాస్‌గా పిలుస్తున్న లీడర్‌పై నేరుగా చర్యలు తీసుకునే దిశగా పావులు కదులుతున్నాయన్న ప్రచారం వేడెక్కుతోంది.
లోకేశ్ ఇప్పటికే పలు కేంద్ర మంత్రుల అపాయింట్‌మెంట్లు ఫిక్స్ చేసుకున్నారట. ఆయన ప్రత్యేకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవుతారన్న వార్తలే రాజకీయంగా హీట్ పుట్టిస్తున్నాయి. కేవలం నిధుల కోసం ఢిల్లీ పర్యటన అనుకోవడం చాలా సింపుల్ టాక్ అవుతుందని పరిశీలకుల అభిప్రాయం. వాస్తవానికి ఈ పర్యటన వెనుక వైసీపీని మట్టికరిపించే స్ట్రాటజీ దాగి ఉందని అంటున్నారు. ఒక వైపు రాష్ట్ర ప్రాజెక్టుల నిధుల సాధన, మరోవైపు వైసీపీని బలహీనపరిచే ఆపరేషన్ – రెండు ఫ్రంట్లలోనూ చంద్రబాబు – లోకేశ్ ఢిల్లీ మిషన్ ఆడుతున్నట్లు రాజకీయ వర్గాల విశ్లేషణ. ఈ పర్యటన తరువాతే అసలు బిగ్ బాస్ పై తుది నిర్ణయం వెలువడుతుందని టీడీపీ వర్గాలు స్పష్టంగా చెబుతున్నాయి. మొత్తానికి ఢిల్లీలో చంద్రబాబు – లోకేశ్ అడుగులు కదలడం అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త గేమ్ మొదలయ్యిందన్న మాటే!