
అక్కడి ప్రజల మనోభావాలను ద్రుష్టిలో పెట్టుకొని బద్వేలు జిల్లాలను ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే ఆ జిల్లాకు పోతులూరి వీర్రబ్రహ్మేంద్ర స్వామి పేరును పెట్టాలని సూచించారు. బలహీన వర్గాల జాతిలో పుట్టి కాలజ్ణానాన్ని అందించిన ఆయన పేరు పెట్టడం సముచితంగా ఉంటుందన్నారు. అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతాలైన గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం, కనిగిరి, దర్శి నియోజకవర్గాలతో పొదిలి కేంద్రంగా నూతన జిల్లా ఏర్పాటు చేయాలనే వాదన ఆ ప్రాంతంలో బలంగా వినిపిస్తోందన్నారు. పరిపాలనా సౌలభ్యంతో పాటు సేవలు మెరుగుపడాలనే ఉద్దేశ్యంతో అక్కడి ప్రజలు చాలా బలంగా నూతన జిల్లా ఏర్పాటును కోరుకుంటున్నారని తెలిపారు. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన కాటమరాజ చరిత్రకు ఆధారంగా విలసిల్లిన ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేసి... మనిషిగా జన్మించి పూజలు అందుకునే దేవుడిగా మారిన కాటమరాజు పేరుతో పొదిలి జిల్లాను ఏర్పాటు చేయాలని రామచంద్రయాదవ్ ఆ లేఖలో చంద్రబాబును విజ్ణప్తి చేశారు.