ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకున్నప్పటికీ కుటుంబ సభ్యులు కూడా ఏదో ఒక విషయంలో ఆంధ్రప్రదేశ్ పేరు ఎక్కువగా వినిపించడానికి భాగమవుతున్నారు. ముఖ్యంగా అటు నారా లోకేష్ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబు భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి ఎవరైనా సహాయమని అడిగితే చేస్తూ ఉంటారు. తాజాగా నారా లోకేష్ కుమారుడు (చంద్రబాబు మనవడు) దేవాన్ష్ లండన్ లో అవార్డు అందుకున్నట్లు తెలుస్తోంది. వెస్ట్ మినిస్టర్ హాల్ లో జరిగిన 2025 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ వేడుకలో అవార్డు అందుకున్నట్లు తెలుస్తోంది.


అవార్డు వేడుకలకు తల్లి బ్రాహ్మణి, తండ్రి నారా లోకేష్ కూడా హాజరయ్యారు. గత ఏడాది డిసెంబర్లో దేవాన్ష్ చదరంగంలో ప్రపంచ రికార్డు స్థాయిలో పేరు సంపాదించారు. చదరంగంలో అత్యంత క్లిష్టమైన 175 పజిల్స్ ను వేగవంతంగా పరిష్కరించడంతో పాటుగా 9 ఏళ్ల వయసులోనే ఫాస్టెస్ట్ చెక్ మెట్ సాల్వర్ గా సరి కొత్త రికార్డును సైతం సొంతం చేసుకున్నారు. అలాంటి రికార్డు సంపాదించిన దేవాన్ష్  మరో రెండు రికార్డులను సాధించినట్లుగా లండన్  వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారికంగా ధ్రువీకరించారు.


ఈ చదరంగ ఆటతీరులో 11:59 సెకండ్లలో చెక్ మెట్ పజిల్ ను పూర్తి చేశారు దేవాన్ష్.  ప్రపంచ రికార్డు నెలకొల్పిన దేవాన్ష్ లండన్ లో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నిర్వహించే వారి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు. అలా అందుకోవడంతో  దేవాన్ష్ తల్లిదండ్రులు తమ కుమారుడు మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. తన కుమారుడు గురించి నారా లోకేష్ మాట్లాడుతూ 10 ఏళ్ల వయసులోనే ఆలోచనలకు పదును పెట్టి ఒత్తిడిలో ప్రశాంతంగా ఉంటూ ఎంతో అంకితభావంతో చెస్ నేర్చుకున్నాడనీ ఎన్నో గంటలపాటు కఠోర శ్రమను కేటాయించడం తాను కల్లారా చూసానని ఆ కష్టానికి తగ్గ ఫలితం చూసి ఇప్పుడు ఆనంద పడుతున్నానని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అటు ఈ విషయం విన్న కార్యకర్తలు ,నేతలు కూడా దేవాన్ష్ పైన ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: