మిరాయి... మిరాయి... మిరాయి..ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో, సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో, ప్రతి ఒక్కరి నోట ఈ ఒక్క పేరే మారుమ్రోగుతోంది. చిన్నా, పెద్దా ఎవరైన  ఈ సినిమా పేరు వినకుండా ఉండలేని స్థాయికి చేరిపోయింది. తేజ సజ్జ హీరోగా నటించిన ఈ మిరాయి సినిమా నిజంగా బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తోంది. ఎలాంటి భారీ అంచనాలు లేకుండా, ఎలాంటి హైప్ లేకుండా, సాదాసీదా ప్రమోషన్‌తో, సింపుల్ కాన్సెప్ట్‌తో, తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పుడు టాలీవుడ్ మాత్రమే కాకుండా మొత్తం భారతీయ సినిమా పరిశ్రమను షేక్ చేసేస్తోంది. సినిమా కథ, స్క్రీన్‌ప్లే, టెక్నికల్ వర్క్, ఎమోషన్స్ అన్నీ కలిపి ప్రేక్షకులను థియేటర్లలో కట్టిపడేస్తున్నాయి. తేజ సజ్జ లాంటి యువ హీరో కూడా ఇంతటి పెద్ద రికార్డ్స్ సాధించగలడని ఎవరు ఊహించలేదు. కానీ ఈ సినిమా విజయంతో తేజ తన పేరు పరిశ్రమలో సుస్థిరం చేసుకున్నాడు. ఈ రోజు ప్రతి ఒక్కరి నోటా తేజ పేరు వినిపించడం వెనుక ప్రధాన కారణం మిరాయి సినిమా అని గర్వంగా చెప్పుకోవచ్చు.


ఈ సినిమాకి దర్శకత్వం వహించిన కార్తీక్ ఘట్టమనేని మొదట ఈ స్క్రిప్ట్‌ను టాలీవుడ్‌లోని పలువురు స్టార్ హీరోలకు వినిపించినట్లు సమాచారం. మొదట గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు ఈ కథను నేరుగా చెప్పారట. కానీ ఆ సమయంలో రామ్ చరణ్ బిజీ షెడ్యూల్స్ కారణంగా ఈ ప్రాజెక్ట్‌ను చేయలేకపోయారని ఇండస్ట్రీలో టాక్. తరువాత నేచురల్ స్టార్ నానికి ఈ కథను వినిపించగా, ఆయన కూడా అప్పట్లో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ ఉండటంతో ఈ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చిందట. అలాగే లేడీస్ హార్ట్‌త్రోబ్, నేషన్‌ల్ మేల్ క్రష్ విజయ్ దేవరకొండకూ ఈ స్క్రిప్ట్ వెళ్లిందట. కానీ సినిమా కాన్సెప్ట్ తన స్టార్ ఇమేజ్‌కు సరిపడదని భావించి విజయ్ ఈ కథను తిరస్కరించాడని తెలుస్తోంది. ఇలా వరుసగా ఇండస్ట్రీలోని టాప్ హీరోల చేత ఈ ప్రాజెక్ట్ రిజెక్ట్ అవుతుంటే, తేజ సజ్జ ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చి సైన్ చేయడం నిజంగా సినిమా మేకర్స్‌కి గోల్డెన్ టర్నింగ్ పాయింట్‌గా మారింది.



సినిమా రిలీజ్ అయిన తర్వాత తేజ సజ్జ పేరు రాత్రికిరాత్రే స్టార్ హీరోల సరసన నిలిచిపోయింది. ప్రస్తుతం తేజ ఏ ప్రాజెక్ట్ సైన్ చేసినా ఇండస్ట్రీలో ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది. మీరాయి విజయంతో దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని విజనరీ డైరెక్టర్‌గా పేరుపొందారు. ఆయన కథ చెప్పే తీరు, ఎమోషనల్ పాయింట్స్ హైలైట్ చేసిన విధానం, టెక్నికల్ టీమ్ కృషి అన్నీ కలిపి ఈ సినిమాను బ్లాక్‌బస్టర్‌గా నిలబెట్టాయి. తక్కువ బడ్జెట్‌లో, సింపుల్ కాన్సెప్ట్‌తో తీసిన ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధించడం టాలీవుడ్ చరిత్రలో అరుదైన విషయం. ఇప్పుడు మీరాయి టాక్ విన్న తర్వాత టాప్ హీరోలందరూ ఈ కథను వదులుకోవడం పెద్ద తప్పిదమని భావిస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు. తేజ ఈ సినిమాతో నిజంగానే ఇండస్ట్రీలో ఓ బలమైన హీరోగా తన స్థానం సంపాదించుకున్నాడు. మొత్తానికి మీరాయి సినిమా తేజ కెరీర్‌ను మాత్రమే కాకుండా, టాలీవుడ్‌లో యువ హీరోలకు కొత్త దారి చూపించేలా నిలిచిపోయింది. ఈ సినిమా విజయం వల్ల తేజ, దర్శకుడు కార్తీక్, మొత్తం టీమ్ ఇప్పుడు నేషనల్ లెవెల్‌లో గుర్తింపు పొందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: