నిన్నటి రోజు నుంచి రాజస్థాన్, మధ్య ప్రదేశ్ వంటి ప్రాంతాలలో వరుసగా చిన్న పిల్లల మరణాలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఈ ఘటనలకు ముఖ్య కారణం చిన్న పిల్లల దగ్గు సిరప్లె అంటూ అధికారులు తెలియజేస్తున్నారు దీంతో వెంటనే ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తం కావాలని అధికారులు చర్యలు చేపట్టి ఆ దగ్గు సిరప్ల పంపిణీ నిలిపివేస్తున్నారు. మరి ఆ దగ్గు సిరప్ ఏంటో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం


మధ్యప్రదేశ్ లో చింద్వారా జిల్లాలో ఆగస్టు 24 నుంచి సెప్టెంబరు నెలాఖరి వరకు సుమారుగా 6 మంది పిల్లలు దగ్గు సిరప్ వాడిన తర్వాత కిడ్నీ ఇన్ఫెక్షన్స్ కు గురై మృతి చెందారంటూ వైద్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా జ్వరం మూత్ర సమస్యల ప్రధాన కారణంగా మరి మరణించినట్లుగా తెలియజేస్తున్నారు. ఆ వెంటనే కోల్డ్ రిప్ , నెక్స్ ట్రో -డీఎస్ వంటి సిరప్ల వినియోగాన్ని నిషేధించారు. ఇక రాజస్థాన్లో సిఖర్ జిల్లాలో కూడా ఉచిత వైద్య పథకం కింద సరఫరా చేసినటువంటి "డెక్స్ ట్రో మెథోర్ఫాన్ హైడ్రోబ్రోమైడ్"  దగ్గు సిరప్ ఉపయోగించిన తరువాత ఐదేళ్ల బాలుడు మరణించారు. మరి కొంతమంది పిల్లలు కూడా అస్వస్థకు గురి కావడంతో  రాజస్థాన్ మెడికల్ సర్వీస్ రాష్ట్రవ్యాప్తంగా వీటి పంపిణీ నిలిపివేసింది.



అయితే అక్కడ అధికారులు తెలుపుతున్న ప్రకారం ఈ సిరప్ పిల్లలకు అనుకూలంగా లేదని నాలుగేళ్ల చిన్నారుల పైన తీవ్ర ప్రభావం చూపిస్తోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎవరు కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా  ఎలాంటి దగ్గు సిరప్ లు ఇవ్వకూడదంటూ సూచిస్తున్నారు. గతంలో కూడా ఇండియన్ కంపెనీ తయారుచేసిన దగ్గు సిరప్ గాంబియా, ఉజ్జెకిస్తాన్ వంటి ప్రాంతాలలో కూడా చిన్నారుల మృతి ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో ఇప్పుడు ప్రభుత్వ ఆరోగ్యపథకాల కింద సరఫరా చేసే మందులను కచ్చితంగా ల్యాబ్ టెస్టులు చాలా కఠినంగా  చేయించిన తరువాతే అధికారులు నిర్ధారణ చేయాలని కేంద్రం ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: