పాలిటిక్స్ అంటేనే ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం .  ఇది ఖచ్చితంగా అన్ని రాజకీయాల్లో కనిపించే సాధారణ అంశం. ఏ రాష్ట్రం అయినా సరే, అధికార పార్టీపై ప్రతిపక్ష పార్టీ విమర్శలు గుప్పిస్తూనే ఉంటుంది. తాజాగా తమిళనాడులో కూడా అలాంటి ఒక ఇష్యూ పెద్ద రాద్ధాంతమే సృష్టించింది. తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపుగా మారుతున్న వ్యక్తిగా విజయ్ దళపతి పేరు ఇప్పుడు చర్చలో ఉంది. ఆయన కమిట్‌మెంట్, నమ్మకం, ధైర్యం కారణంగా తమిళనాడులో జరగబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తారని చాలామంది విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే ఎవరు ఊహించని విధంగా, ఇప్పుడు తమిళనాడు ప్రజలు విజయ్‌పై మండిపడే స్థాయిలో మాట్లాడుతున్నారు.


దానికి కారణం — కరూర్ ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 39 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.ఈ ఘటనపై విజయ్ పార్టీ టీవీకే  సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సీబీఐ దర్యాప్తు కోరుతూ టీవీకే పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేయగా, దానిపై సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ఆ పిటిషన్ విచారణకు అంగీకరించింది. తొక్కిసలాట ఘటనపై సీబీఐ దర్యాప్తు కోరుతూ అక్టోబర్ 3న మదురై బెంచ్‌లో విచారణ జరిగింది.

 

"కరూర్ ఘటనపై పోలీసులు దర్యాప్తు ఇంకా ప్రారంభ దశలోనే ఉందని, ఇలాంటి సమయంలో సీబీఐ దర్యాప్తు కోరడం సరైంది కాదని హైకోర్టు అభిప్రాయపడింది. ఇది రాజకీయ గేమ్‌లా మారుతోందని, కోర్టులను రాజకీయ వేదికలుగా మార్చవద్దని హెచ్చరించింది. అలాగే హైవేలపై రాజకీయ సభలకు అనుమతి ఇవ్వకూడదని నిషేధించింది".దీనిని సవాల్ చేస్తూ టీవీకే సుప్రీంకోర్టును ఆశ్రయించింది విజయ్ పార్టీ. పోలీసుల స్వతంత్రతపై హైకోర్టు సందేహాలు వ్యక్తం చేసినప్పటికీ, అదే పోలీసు విభాగానికి చెందిన ఉన్నతాధికారులను దర్యాప్తు బృందంగా నియమించడం అన్యాయమని టీవీకే తరుపు న్యావాది పిటిషన్‌లో పేర్కొన్నారు.



దురుద్దేశపూర్వకంగా ర్యాలీ స్థలంలో గందరగోళం సృష్టించేందుకు కుట్ర జరిగి ఉండవచ్చని కూడా పిటిషన్‌లో పేర్కొన్నారు. అందువల్ల వాస్తవ పరిస్థితులను గుర్తించడానికి స్వతంత్ర దర్యాప్తు తప్పనిసరని టీవీకే తరుపున న్యావాది వాదిస్తున్నారు. హైకోర్టు వాస్తవ విచారణ లేకుండానే, సాక్షాలను పరిగణించకుండానే పిటిషన్‌ను తిరస్కరించిందని టీవీకే పేర్కొంది. ఈ పిటిషన్‌పై అక్టోబర్ 10న విచారణ జరగనుంది. దీంతో “విజయ్ దళపతి అనుకున్నది సాధిస్తున్నాడు” అంటూ తమిళనాడు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. తొక్కిసలాట ఘటన తర్వాత విజయ్ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ, “ఇందులో నా తప్పు ఏమీ లేదు, కొందరు రాజకీయ కుట్రల వల్ల ఇదంతా జరిగింది. త్వరలోనే దీనిపై కఠిన చర్యలు తీసుకుంటాను” అని తెలిపారు.ఫైనల్‌గా అనుకున్నట్టే చేశారు — నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తూ విజయ్ దళపతి తీసుకున్న ఈ నిర్ణయం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఇది ఇప్పుడు ఒక సెన్సేషనల్ మూమెంట్‌గా మారిపోయింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: