ఆ వ్యక్తి చూడడానికి చాలా పద్ధతిగా ఉద్యోగస్తుడిలా కనిపిస్తున్నారు.కానీ అతని చేష్టలు చూస్తూ ఉంటే ఆ వ్యక్తిని ఏం చేసినా కూడా తప్పు లేదనిపిస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే రైలులో ఒక బాలిక పక్కన కూర్చున్న ఆ వ్యక్తి ఒక చేతిలో తన బ్యాగు పట్టుకొని మరొక చేతిలో ఆ బాలిక పైన ప్రైవేటు భాగాల మీద చెయ్యి వేసి మృగంలా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. రైలులో చాలా చోట్ల సీట్లు ఖాళీగా ఉన్న ఆ వ్యక్తి మాత్రం బాలిక వద్ద కూర్చొని ఆ బాలికను ఇబ్బంది పెడుతున్నట్లు కనిపిస్తోంది.
ఆ బాలిక ఈ ఇబ్బందిని గమనించి తల్లిపై పడుకుంది. ఈ దృశ్యాలను అక్కడ ఒక వ్యక్తి తన మొబైల్లో చిత్రీకరించారు. అయితే ఈ వీడియో తీస్తున్నాడని గ్రహించిన ఆ వ్యక్తి వెంటనే వీడియో డిలీట్ చేయాలంటూ ప్రాధేయపడినట్లుగా కనిపిస్తోంది. కానీ ఆ ట్రైన్లో ఉన్న ప్రయాణికులు మాత్రం ఒప్పుకోకపోవడంతో అక్కడి నుంచి ఆ వ్యక్తి పారిపోయారు. కానీ ఈ సంఘటన ఏ ప్రాంతంలో జరిగేదో తెలియదు కానీ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చాలామంది నెట్టిజెన్స్ సైతం ఆ వ్యక్తి చేసిన పనికి ఆగ్రహాన్ని తెలియజేస్తూ తిట్టిపోస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి వాళ్లకి ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి జైలు శిక్ష పడేలా చేయాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి