కాకినాడ, విశాఖపట్నం, విజయనగరం, నెల్లూరు, బాపట్ల, చిత్తూరు జిల్లాల్లో తుపాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. కానీ సోమవారం రాత్రి 7 గంటల వరకు చెప్పుకోదగ్గ వర్షం ఎక్కడా పడలేదు. అయినా సోషల్ మీడియాలో మాత్రం ‘భారీ వర్షాలు కురుస్తున్నాయి’, ‘ఇళ్లు కూలిపోతున్నాయి’ అనే తప్పుడు వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. గతంలో వచ్చిన హుద్‌హుద్, తిత్లీ తుఫానుల వీడియోలను రీసైకిల్ చేసి “ఇది మొంథా ప్రభావం” అంటూ పోస్ట్ చేస్తున్నారు కొందరు. ఈ నకిలీ వీడియోలు చూసి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అసలు పరిస్థితేంటి అన్నదానిపై స్పష్టత లేకుండా మిస్‌ఇన్ఫర్మేషన్ వ్యాపిస్తోంది. ప్రభుత్వం ఉక్కుపాదం – ఫ్యాక్ట్ చెక్ యాక్షన్! .. ఇలాంటి నకిలీ ప్రచారాలను అరికట్టేందుకు ప్రభుత్వం “ఫ్యాక్ట్ చెక్” యూనిట్ ద్వారా ఎప్పటికప్పుడు వివరణలు ఇస్తోంది.
విపత్తు నిర్వహణ శాఖ, పోలీసు శాఖలు ఫోన్ల ద్వారా, సోషల్ మీడియా ద్వారా ప్రజలకు నిజమైన సమాచారం అందిస్తున్నాయి. అయినా ఫేక్ ప్రచారం మాత్రం ఆగడం లేదు. ఇక తాజాగా పరిస్థితి అంత దారుణంగా మారింది - “వాస్తవాలను మాత్రమే పంచండి, నకిలీలు వద్దు బ్రో!” అంటూ మంత్రి నారా లోకేష్ కూడా స్పందించాల్సి వచ్చింది. ఇది ఎంత పెద్ద స్థాయిలో నకిలీ ప్రచారం జరుగుతోందో అర్థమవుతోంది. ప్రజలకు హెచ్చరిక: అధికారిక సమాచారం మాత్రమే నమ్మండి! .. ప్రభుత్వం ఇప్పటికే ప్రమాదం ఉన్న ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించింది. ఇంకా సముద్రంపై తుపాను ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో తుపాను భీభత్సం వీడియోలు షేర్ అవుతున్నాయి. ఇవన్నీ పాత వీడియోలు అని అధికారులు స్పష్టం చేశారు. మొత్తం మీద, తుపాను కన్నా పెద్ద తుపాను సోషల్ మీడియాలోనే విరుచుకుపడుతోంది. ప్రజలు భయపడకుండా, అధికారిక సమాచారాన్నే నమ్మాలని ప్రభుత్వం చెబుతోంది. వాస్తవం ఒక్కటే - “ఫేక్‌కు బ్రేక్ పెట్టాలి!”
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి