శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తుకిసులాట ఘటనలో ఇప్పటికే 9 మంది భక్తులు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిసి వేచిందని అన్నారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగారాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు 50 వేల పరిహారం ఇవ్వనన్నట్టు తెలిపారు.
ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం మృతుల వివరాలు ఇవే..
మృతులు ఏదూరి చిన్నమ్మ ( టెక్కలి రామేశ్వరం ) - మృతులు రాపాక విజయ ( టెక్కలి ), యశోదమ్మ ( శివరాంపురం ) , మృతులు నేలమ్మ( దుక్కవానిపాటి ) , రాజేశ్వరి ( బెల్లిపటియా ) గా తెలిసింది. మిగిలిన వారి వివరాలు రావాల్సి ఉంది.
కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట ఘటనపై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఆలయానికి ప్రతివారం 1500 నుంచి 2000 మంది భక్తులు దర్శనం కోసం వస్తారని ఆమె తెలిపారు. అయితే వెంకటేశ్వర స్వామి ఆలయం మొదటి అంతస్తులో ఉంది. భక్తులు 20 మెట్లు ఎక్కి పైకి వెళ్లే క్రమంలో ఒక్కసారిగా రెయిలింగ్ ఊడి పడిందని తెలుస్తోంది. ఈ ఘటనతో వగరుపై ఒకరు పడి తొక్కిసలాట చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి