ఇటీవలే ఆసియా కప్లో భాగంగా వరుసగా రెండు విజయాలు సాధించిన టీమిండియా జట్టు సూపర్ 4 లో అడుగు పెట్టింది.. ఇక సూపర్ 4 లో భాగంగా క్వాలిఫై అయిన నాలుగు జట్లు కూడా మిగిలిన మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడాల్సి  ఉంటుంది. ఇలాంటి సమయంలోనే సూపర్ 4లో భాగంగా పాకిస్థాన్తో మ్యాచ్ ఆడిన టీమిండియా ఓటమి చవిచూసింది. 5వికెట్ల తేడాతో పాకిస్థాన్ జట్టు భారత జట్టుపై విజయం సాధించింది.. ఇలాంటి సమయంలో ఇక ఆటో ఫైనల్ వరకు వెళ్ళాలి అంటే మిగతా రెండు మ్యాచ్ లలో టీమిండియా తప్పక గెలవాల్సిన పరిస్థితి.


 ఇక నేడు శ్రీలంక భారత్ మధ్య మ్యాచ్ జరగబోతోంది అన్న విషయం తెలిసిందే. చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో టీమిండియా ఎలా రాణించ బోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే ఇక ఈ ఆదివారం భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ కి సంబంధించిన చర్చ మాత్రం ఇంకా ముగియా లేదు. కీలకమైన సమయంలో సిక్సర్లు ఫోర్లు తో పాకిస్తాన్ బ్యాట్స్మెన్ ఆసిఫ్  చెలరేగిపోతున్న సమయంలో అతను ఇచ్చిన సులభతరమైన క్యాచ్ ను అర్షదీప్ వదిలేశాడు.


 దీంతో నెటిజన్లు అందరూ అతని వల్లే టీమిండియా ఓడిపోయింది అంటూ సోషల్ మీడియా వేదికగా చెడుగుడు ఆడుకున్నారు అని చెప్పాలి. ఇప్పటివరకు ఈ విషయంలో ఎంతో మంది మాజీ క్రికెటర్లు స్పందిస్తూ అతనికి మద్దతుగా నిలిచారు. క్యాచ్ వదిలేయడం పై అర్ష దీప్ సింగ్ స్పందిస్తూ  ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్తో మ్యాచ్లో  క్యాచ్  వదిలేయడంతో నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు మెసేజ్లు చేస్తున్నారు ఇవన్నీ చూస్తుంటే నాకు నవ్వొస్తుంది . వీటిని నేను పాజిటివ్గా తీసుకుంటాను. ఈ ఘటన నాకు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది.
 ప్రతి క్రికెటర్లు తమ  జట్టు గెలవాలని కోరుకుంటాడని ఓడిపోవాలని కోరుకోడు అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: