ఇటీవల కాలంలో భారత జట్టులో సీనియర్లుగా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కే ఎల్ రాహుల్ లకు తరచూ సెలెక్టర్లు విశ్రాంతి ఇవ్వడం చూస్తూ ఉన్నాము అని చెప్పాలి. అదే సమయంలో సీనియర్ ప్లేయర్లు కూడా గాయాల బారిన పడుతూ జట్టుకు దూరమవుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇలాంటి సమయంలో ఒకవేళ మంచి ఫామ్ లో ఉన్న సీనియర్ ప్లేయర్లు జట్టుకు అందుబాటులో లేకపోతే ఇక వారి స్థానంలో ఎవరు ఆడితే బాగుంటుంది అనే విషయంపై ఎప్పటికప్పుడు మాజీ ఆటగాళ్లు స్పందిస్తూ తమ అభిప్రాయాలను రివ్యూల రూపంలో చెప్పేస్తున్నారు అని చెప్పాలి.



 ఈ క్రమంలోనే ఇప్పటికే టీమిండియా కు రోహిత్, కేఎల్ రాహుల్ తర్వాత ఓపెనింగ్ జోడి ఎవరు ఉంటే బాగుంటుంది అనే దానిపై రెండు మూడు ఆప్షన్లు ఉన్నాయి. కానీ విరాట్ కోహ్లీ స్థానంలో ఎవరైతే బాగుంటుంది అన్నది ఇప్పటికి ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది. ఇక ఇటీవల భారత వెటరన్ ఆటగాడు దినేష్ కార్తీక్.. ఇదే విషయంపై మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. విరాట్ కోహ్లీకి ప్రత్యామ్నయమైన ఆటగాడు రాహుల్ త్రిపాఠి అంటూ చెప్పుకొచ్చాడు. న్యూజిలాండ్ తో జరిగిన టి20 సిరీస్, లంకతో జరిగిన సిరీస్ లోను అతను మంచి ప్రదర్శన చేశాడు అంటూ చెప్పుకొచ్చాడు.



 కోహ్లీ అందుబాటులో లేని సమయంలో భారత జట్టు తరుపున మూడవ స్థానంలో అతను బ్యాటింగ్ కు దిగితే బాగుంటుంది. ఎందుకంటే పరిస్థితులు ఎలా ఉన్నా అతను రిస్క్ తీసుకుంటాడు. దూకుడుగా ఆడుతాడు. భారీ షాట్లు ఆడటంలో కూడా సక్సెస్ అవుతాడు. దూకుడు అయిన ఆటతీరు అతని డిఎన్ఏ లోనే ఉంది. ఒక కోచ్, కెప్టెన్ కు కావాల్సింది అలాంటి ఆటగాడే అంటూ దినేష్ కార్తీక్ తెలిపాడు. ఇక పెద్ద మ్యాచ్ లలో భారత జట్టుకు అతని అవసరం ఎంతైనా ఉంది. అయితే ఆటగాళ్లకు పదేపదే అవకాశాలు రావు. వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి అంటూ దినేష్ కార్తీక్ సూచించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: