
అయితే ఇలా టీ20 ఫార్మాట్లో అద్భుతమైన ప్రదర్శన చేస్తున్న సూర్య కుమార్ యాదవ్ వన్డే ఫార్మాట్లో మాత్రం ఎక్కడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయడం లేదు అని చెప్పాలి. ప్రస్తుతం టి20 లో నెంబర్ వన్ గా ఉన్న సూర్య కుమార్ కి బిసిసిఐ వన్డే ఫార్మాట్ లో అవకాశాలు ఇస్తుంది. అయినప్పటికీ అతను మాత్రం సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. ఇప్పటివరకు ఆస్ట్రేలియాతో జరిగిన రెండు వన్డే మ్యాచ్ లలో కూడా డకౌట్ గానే వెను తిరగడం అటు అభిమానులందరినీ కూడా నిరాశపరచింది. దీంతో ఇక మూడో వన్డే మ్యాచ్లో అతని జట్టు నుంచి పక్కన పెడతారు అంటూ వార్తలు కూడా వచ్చాయి.
ఇక మూడో వన్డేలో సూర్యకుమార్కు స్థానం లేనట్లేనా.. వరుసగా విఫలమవుతున్న సూర్య కుమార్ ను పక్కకు పెట్టి మరొకరుని తీసుకుంటారా అని సందేహం ఉన్న నేపథ్యంలో రోహిత్ క్లారిటీ ఇచ్చాడు. సూర్య కుమార్ టి20 లో సూపర్ ప్లేయర్. అతనిలో ఆటలో లోపల గురించి కూడా అతనికి తెలుసు. వన్డే ఫార్మాట్లో పుంజుకుని బాగా ఆడతాడని నమ్మకం ఉంది. శ్రేయస్ అయ్యర్ ఎప్పుడు జట్టులోకి వస్తాడో తెలియదు. అతను వచ్చేవరకు సూర్యకుమార్ టీం లోనే ఉంటాడు అంటూ రోహిత్ క్లారిటీ ఇచ్చాడు.