
కొంతమందికి గాయం బారిన పడి కొన్ని మ్యాచ్లకు దూరమవుతూ ఉంటే.. మరి కొంతమంది ఆటగాళ్లు గాయంతో పూర్తిగా ఐపిఎల్ సీజన్ మొత్తానికి దూరం అవుతున్న పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి. ఇక ఇలా స్టార్ ప్లేయర్లు దూరమవుతూ ఉన్న నేపథ్యంలో కొన్ని ఫ్రాంచైజిల వ్యూహాలు తారుమారు అయిపోతున్నాయి. ఇక ఇప్పుడు ఈసారి అయినా అటు టైటిల్ గెలవాలని పట్టుదలతో ఉన్న పంజాబ్ కింగ్స్ జట్టుకి ఇంకా ఐపీఎల్ ప్రారంభం కాకముందే ఊహించని షాక్ తగిలింది అని చెప్పాలి. ఏకంగా జట్టులో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న ఆటగాడు గాయం బారిన పడి టోర్నీ మొత్తానికి దూరమయ్యే పరిస్థితి వచ్చింది.
ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ బెయిర్ స్ట్రో అటు ఐపీఎల్ లో కూడా మంచి రికార్డు కలిగి ఉన్నాడు. అయితే గత ఏడాది జరిగిన వేలంలో ఈ ప్లేయర్ ను 6.25 కోట్లు పెట్టి మరి అటు పంజాబ్ జట్టు కొనుగోలు చేసింది. అయితే ఇక ఇప్పుడు ఆ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. గత ఏడాది సౌతాఫ్రికా తో టెస్ట్ మ్యాచ్ కు ముందు గోల్ఫ్ ఆడుతూ గాయపడ్డాడు. అతడికి లింగమెంట్ డ్యామేజీ అయింది. అయితే ఐపీఎల్ సమయానికి గాయం నుంచి కోలుకుంటాడు అనుకున్నప్పటికీ అలా జరగలేదు. దీంతో ఐపీఎల్ టోర్నీ మొత్తానికి దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా గతంలో ఈ ప్లేయర్ సన్రైజర్స్ తరఫున ఆడాడు.