బృహదీశ్వర ఆలయం.. ఇది తమిళనాడు లోని తంజావూరులో ఉంది.  11వ శతాబ్దంలో రాజా చోళ రాజు నిర్మించిన ఇది భారతదేశపు అతిపెద్ద ఆలయం. తంజావూరులో మొత్తం 74 దేవాలయాలు ఉన్నాయి. అయితే వీటిలో చాలా అద్భుతమైంది శ్రీ బృహదేశ్వర ఆలయం. చోళ శక్తి చిహ్నమైన ఈ అతిపెద్ద ఆలయం 1,30,000 టన్నుల గ్రానైట్ తో నిర్మించబడిన ప్రపంచంలోనే మొట్ట మొదటి శివాలయంగా గుర్తింపు పొందింది. అయితే వందల మైళ్ల దూరం వరకూ ఎక్కడా గ్రానైట్ అనేది కనిపించదు. 

IHG

గ్రానైట్ క్వారీల నుంచీ ఇక్కడి రాళ్లను ఏ విధంగా తీసుకువచ్చారో..? ఎంత కాలం పట్టింది..? లాంటి ప్రశ్నలకు సమాధానం లేదనే చెప్పాలి. ఇక ఈ ఆలయంలో సుమారు 12 అడుగుల ఎతైన శివలింగం సాక్షాత్కరిస్తూ భక్తులను ఆధ్యాత్మిక లోకాల్లో విహరింపజేస్తూంటుంది. అందుకు తగ్గట్టుగా.. ఆలయ ముఖ ద్వారంలో 12 అడుగుల మహానంది క్షేత్ర పాలకునిగా.. ద్వార పాలకునిగా పర్యవేక్షిస్తూండటం విశేషం. ఈ ఆలయ గోపురం 66 మీటర్ల ఎత్తు, 80 టన్నుల భారీ రాతిని కలిగి ఉంది. 

IHG

ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఆ ఆలయ గోపురం నీడ ఎప్పుడూ నేల మీద పడదు. మధ్యాహ్న సమయంలో కూడా ఇక్కడ నీడ కనిపించడం జరగదు. సంవత్సరం పొడవునా.. ఏ రోజూ ఆలయ నీడలు భూమీద పడకపోవటం అంతుచిక్కని రహస్యం. శాస్త్ర పరిశోధకులు.. పురాతత్వ శాస్తజ్ఞ్రులు ఏ రీతిన చూసినా ఇప్పటికీ వీడని మిస్టరీ గానే మిగిలింది. ఈ అద్భుతమైన ఆలయం ఇప్పుడు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా జాబితా చేయబడింది. ఇది తంజావూరులోని ప్రధాన పర్యాటక ఆకర్షణల్లో ప్రముఖమైనది.

IHG


 
 

మరింత సమాచారం తెలుసుకోండి: