అయితే నిన్న రాజస్థాన్ రాయల్స్... కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. సమఉజ్జీలుగా ఉన్న ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఎంతో హోరాహోరీగా జరిగింది. ఇక ఈ మ్యాచ్లో ఏకంగా 37 పరుగుల తేడాతో కోల్కతా నైట్రైడర్స్ జట్టు ఘన విజయం సాధించింది. ఇక ఒక్క విజయం కోల్కతా జట్టు స్థానాన్ని మార్చేసింది. అప్పటివరకు పాయింట్ల పట్టికలో చివరన ఉన్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఒక్కసారిగా 7వ స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకింది. రాజస్థాన్ ఓటమి సన్రైజర్స్ పాయింట్లపై దెబ్బ వేసింది. ఆరో స్థానంలో ఉన్న సన్ రైజర్స్ 7వ స్థానం లోకి పడి పోయింది.
చివరిలో చెన్నై సూపర్ కింగ్స్ కొనసాగుతోంది. కోల్కతా మ్యాచ్ కి ముందు వరకు మొదటి స్థానంలో కొనసాగింది రాజస్థాన్ రాయల్స్ జట్టు. కానీ ఒక్క ఓటమితో ఒక్కసారిగా మూడవ స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు టాప్-4లో ఉంది . ఇక ఆ తర్వాత వరుసగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్ జట్లు ఒక స్థానాన్ని దిగజారి వరుసగా ఐదు ఆరు స్థానాల్లో కొనసాగుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి