ఇటీవల కాలంలో భారత క్రికెట్లో వన్డే కెప్టెన్సీ మార్పు విషయం ఎంత సంచలనంగా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వన్డే కెప్టెన్ గా ఉన్న విరాట్ కోహ్లీని తప్పించి రోహిత్ శర్మ ను కెప్టెన్ గా నియమించడం సంచలనంగా మారిపోయింది. బీసీసీఐ ఉద్దేశపూర్వకంగానే వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ ఎన్నిని తప్పించింది అంటూ ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే స్పందించిన  బీసీసీఐ తాము విరాట్ కోహ్లీ కి సమాచారం ఇచ్చి కెప్టెన్సీ నుంచి తప్పించాము అంటూ క్లారిటీ ఇచ్చింది. అయితే తర్వాత ప్రెస్ మీట్లో మాట్లాడిన కోహ్లీ తనకు బిసి ఏమీ చెప్పలేదు అంటూ చెప్పడంతో ఇక కెప్టెన్సీ మార్పు వివాదం మరింత ముదిరింది అనే చెప్పాలి.



 ఇలా వన్డే కెప్టెన్సీ మార్పు విషయంలో ప్రస్తుతం బీసీసీఐ విరాట్ కోహ్లి మధ్య యుద్ధమే జరుగుతుంది. ఇక వన్డే కెప్టెన్సీ మార్పు విషయంలో అటు బిసిసిఐకి కోహ్లీ మధ్య తలెత్తిన వివాదం విషయంలో ఎంతో మంది మాజీ క్రికెటర్లు కూడా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు కొంతమంది కోహ్లీకి మద్దతు పలుకుతూ ఉండగా.. మరికొంతమంది అటు బిసిసిఐ నిర్ణయం సరైన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల పాక్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్ ఈ విషయంపై స్పందించారు. యూట్యూబ్ ఛానల్ వేదికగా భారత కెప్టెన్సీ మార్పు పై స్పందించిన సల్మాన్ బట్  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


 అందరూ వన్డే కెప్టెన్సీ మార్పు గురించి మాట్లాడుతుంటే సల్మాన్ బట్ మాత్రం టెస్ట్ కెప్టెన్సీ గురించి మాట్లాడాడు. ఒకవేళ బిసిసిఐ విరాట్ కోహ్లీని టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పించి రోహిత్ శర్మను నియమిస్తే అది సరైన నిర్ణయం కాదు అంటూ చెప్పుకొచ్చాడు. టెస్ట్ సారథిగా విరాట్ కోహ్లీ తప్పించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు అంటూ చెప్పుకొచ్చాడు.. అయితే ఇది జరుగుతుందో లేదో తెలియదు కానీ ఇది జరిగితే మాత్రం రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ మధ్య విభేదాలు ఉన్నాయి అన్నది అందరికీ అర్థమవుతుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అంతేకాదు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇన్ ఫీల్డ్, ఆఫ్ ఫీల్డ్ లో కూడా ఎక్కడ కలిసి ఉండరు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక టెస్ట్ క్రికెట్ లో మంచి విజయాలు సాధించిన కోహ్లీనే కెప్టెన్ గా కొనసాగించాలంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: