ఎంతో ఉత్కంఠ భరితంగా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో కొన్ని కొన్ని సార్లు అందరిని ఆశ్చర్య పరిచే ఘటనలు జరుగుతూనే ఉంటాయి. బ్యాట్స్మెన్లు అదిరిపోయే సిక్సర్లు కొట్టడం ఫీల్డర్లు పాదరసంలా కదులుతూ అబ్బురపరిచే క్యాచ్ పట్టడం లాంటివి చేస్తూ ఉంటారూ. ఇక ఇలాంటివి ఏదైనా జరిగింది అంటే అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. ఇక ఇలాంటి వీడియోలు సోషల్ మీడియా ను షేక్ చేస్తూ ఉంటాయ్. ఇటీవలే ఇంగ్లాండ్ టీమిండియా మధ్య జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఇలాంటి ఒక క్యాచ్ ప్రేక్షకులందరినీ కూడా ఆశ్చర్యపరుస్తోంది.


 ఇటీవలే అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో యువ ఇంగ్లాండ్ పై భారత కుర్రాళ్లు జట్టు ఆదిపత్యాన్ని సాధించిన విజయంతో అదరగొట్టింది. ఐదవ సారి అండర్-19 ప్రపంచ కప్ ను ముద్దాడింది భారత జట్టు. ఇక మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతున్న సమయంలో భారత ఆటగాడు కౌశల్ తంబే పట్టిన క్యాచ్ అందరిని ఆశ్చర్యపరిచింది. టీమిండియా బౌలర్లు ఎంత ప్రయత్నించినప్పటికీ ఫోర్లు సిక్సర్లతో చెలరేగిపోయారు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ జేమ్స్ సేల్స్. ఏకంగా భారీ భాగస్వామ్యాన్ని నిర్మించడం దిశగా ముందుకు సాగారు ఇంగ్లండ్ బ్యాట్స్మెన్లు.


 ఈక్రమంలోనే రవి కుమార్ బౌలింగులో అవుటయ్యాడు జేమ్ స్ సేల్స్. డీప్ స్క్వేర్ దిశగా భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు..  బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నాడు కౌశల్ తంబె. నేరుగా అతని చేతిలోకి వెళ్ళింది  బంతి. కానీ క్యాచ్ పట్టుకోవడంలో మొదట తడబడ్డాడు. దీంతో క్యాచ్ మిస్సయింది అని అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ అంతలోనే గాల్లోంచి తన ముందు కింద పడుతున్న బత్తిని మళ్లీ డ్రైవ్ చేసి మరీ ఒంటి చేత్తో అందుకున్నాడు. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. చివరికి ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ వెనుదిరగక తప్పలేదు. ఇంత అద్భుతమైన క్యాచ్ పై ప్రస్తుతం అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: