సన్ రైజర్స్ స్పీడ్ గన్.. జమ్మూ కాశ్మీర్ జెమ్.. యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ గురించి ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో చర్చ జరుగుతోంది. ఇప్పుడు వరకు భారత క్రికెట్ నుంచి ఎంతోమంది ఫాస్ట్ బౌలర్లు ఉన్నా ప్రపంచంలో ఉన్న మేటి బౌలర్ల కంటే వేగంగా బంతులు విసిరే బౌలర్లు మాత్రం చాలా తక్కువ అని చెప్పాలి. ఒకవేళ ఇలాంటి బౌలర్లు తెరమీదకు వచ్చినా తమని తాము నిరూపించుకుంటూ క్రమం తప్పకుండా అతివేగంతో బంతులు విసిరే వారు చాలా తక్కువ గానే కనిపిస్తూ ఉంటారు. కానీ ఇటీవలి కాలంలో మాత్రం అద్భుతమైన ప్రతిభతో మెరుపువేగంతో బంతులను విసురుతూ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయాడు ఉమ్రాన్ మాలిక్.


 ఎలాంటి వసతులు  లేని జమ్మూ కాశ్మీర్ నుంచి ఒక మంచి క్రికెటర్ గా ఎదిగి.. ఇప్పుడు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున ఆడుతూ అద్భుతమైన బౌలింగ్ ప్రతిభతో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. దీంతో ఇక స్పీడ్ గన్ గా పేరు సంపాదించుకున్న ఉమ్రాన్ మాలిక్  ను వెంటనే టీమిండియా లోకి తీసుకోవాలి అంటూ అటు మాజీ ఆటగాళ్ల నుంచి రోజురోజుకీ డిమాండ్లు ఎక్కువైపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల ఇదే విషయంపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ స్పందించాడు.


 సన్రైజర్స్ హైదరాబాద్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ ను వెంటనే టీమ్ లోకి తీసుకోకపోతే అది భారత్ వెర్రితనము అవుతుందని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ చెప్పుకొచ్చాడు. ఒకవేళ తాను టీమిండియా సెలెక్టర్ గా ఉండి ఉంటే జూలైలో ఇంగ్లాండ్ తో జరిగే టెస్ట్ సిరీస్ కోసం ఉమ్రాన్ మాలిక్ ను తప్పకుండా జట్టులోకి తీసుకుంటాను అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ప్రతి మ్యాచ్లో కూడా 154 కిలోమీటర్ల వేగంతో బంతులను విసురుతున్న ఉమ్రాన్ మాలిక్ తన బౌలింగ్ వేగంతో రికార్డులు కొల్లగొట్టడమే కాదు ఇక వరుసగా వికెట్లు కూడా కొల్ల గొడుతూ ప్రశంసలు అందుకుంటూ ఉన్నాడు.. మరి అందరూ డిమాండ్ చేస్తున్నట్లుగా బిసిసిఐ సెలక్టర్లు అతని టీమిండియా లోకి తీసుకుంటారా లేదా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl